Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోన సెకండ్ వేవ్ వ్యాప్తి రోజురోజుకు పెరు గుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులి టెన్ ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో గడిచిన మూడు నాలుగు రోజులుగా ప్రతిరోజు 50కి పైగానే కొత్త కేసులు నమోదు అవ్వడం కరోనా వ్యాప్తి ఎంతలా రోజురోజుకూ పెరుగుతుందో అర్థమవుతుంది. శుక్రవారం అర్బన్ జిల్లాలో కొత్తగా కరోనా కేసులు 82 నమోదు అయ్యాయి. శుక్రవారం కరోనా అనుమానిత కేసులు వరంగల్ ఎంజీఎంకి పదుల సంఖ్యలో వచ్చి క్యూలో వేచి ఉండి అంతమందికి ఒకేసారి కరోనా టెస్టులు చేసే సౌలభ్యం లేకపోబడంతో ఎంజీఎం సిబ్బంది చేసేది ఏమీలేక చేతులు ఎత్తడం తో కరోనా అనుమానితులు గంటల తరబడి చెట్లకింద కూర్చోడం పట్టి వైరస్ వ్యాప్తి తీవ్రత ఎంతగా ఉందో అర్థం అవుతుంది. ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు వైద్య సిబ్బంది ప్రజలను హెచ్చరిస్తున్నారు.