Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎరువుల ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్యే పెద్ది
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతులను నడ్డి విరిచిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే విధానాలను అవలంభిస్తుందన్నారు. డీఏపీ, పోటాష్, కాంప్లెక్స్ ధరలను రూ.35 నుంచి 40 శాతం పెంచి రైతులపై తీరని భారం మోపిందన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులకు ప్రోత్సహాలను అందించాల్సిన కేంద్రం ఆకస్మికంగా పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నామని తెలిపారు. కరోనా కష్టకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతం కాగా కేవలం రైతులు మరో గంట పాటు పనిచేసి అధికోత్పత్తులను సాధించి దేశానికి అన్నం పెట్టి కాపాడారని తెలిపారు. దేశ, రాష్ట్ర జీడీపీ పెరుగదలకు వ్యవసాయరంగమే కారణమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కాపాడాలనే సంకల్పంతో ప్రాజెక్టులతో సాగు నీరందించారని, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను అందించి అండగా నిలిచి నందున తెలంగాణ దేశంలో అధిక పంట దిగుబడులు సాధించారని గుర్తు చేశారు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ట దిశలో పయనిస్తున్న క్రమం లో కేంద్రం ఎలాంటి చర్చ లేకుండా రైతులను నడ్డివిరేందుకు ఎరువుల ధరలను పెంచి భారం మోపిందని విమర్శించారు. నర్సంపేట నియోజవర్గంలో 65శాతం సాగు పరిగణంలోకి తీసుకొన్నట్లయితే సుమారు 63 వేల హెక్టార్ల విస్తీర్ణం సాగు విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలను రైతులు పండిస్తున్నారని తెలిపారు. ఈ పంటలపై ఉపయోగించే యూరి యా మినహా ఎరువులపై 22 కోట్ల మేరకు భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఏపీపై ఇప్పటిదాకా రూ.11 కోట్ల పెట్టుబడి పెట్టగా పెంచే ధరలతో రూ.17.50 కోట్లు, పోటాషియంపై రూ.3.70 కోట్లకు గానూ రూ.4.25 కోట్లు, కాంపెక్స్ ఎరువులపై రూ.17 కోట్ల పెట్టుబడుల భారం పడనుందని చెప్పారు. వెంటనే రైతులపై కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం రైతులపై చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే ఎరువుల ధరల పెంపు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.