Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాహేతర సంబంధానికి అడ్డుతగులున్నాడనే హత్య
ముగ్గురి అరెస్టు, రిమాండ్: సీఐ రాజిరెడ్డి
నవతెలంగాణ-గూడూరు
గూడూరు మండలం భూపతిపేటలో ఈనెల 6న జరిగిన కుందారపు విక్రమ్ హత్య కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గూడూరు సీఐ రాజిరెడ్డి తెలిపారు. గూడూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ముగ్గు రు నిందితుల అరెస్టు చూపి హత్య కేసు వివరాలు వెల్లడిం చారు. ఈనెల 6న భూపతిపేటలో కుందారపు విక్రమ్ హత్య గావించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు గల కారణాలను విచారణ చేపట్టారు. మృతుడు విక్రమ్ అక్క కల్వచర్ల రోజా, భూప తిపేటకు చెందిన బొడ్డు రేణుకలు రోజు కూలీ పనుల కోసం గ్రామానికి చెందిన పులిశేరి సంతోష్‌కుమార్ టాటాఏస్ వాహనంలో వెళ్లి వస్తుంటారు. ఈక్రమంలో రోజా, సంతోష్ కుమార్ల నడుమ వివాహేతర సంబంధం ఏర్ప డింది. ఈ సంబంధానికి బొడ్డు రేణుక బాసటగా నిలిచి వారిని ప్రోత్స హించేది. ఈ క్రమంలో రోజా తమ్ముడు మృతుడు విక్రం ప్రతిసారి ఇరువురిని మంద లించేవాడు. ఈ సంబందంతో రోజా భర్త కూడా రోజాతో ఉండకుండా వేరుగా ఉంటు న్నాడు. ఈ క్రమంలో ఈనెల 5న ఇరువురిని రేణుక ఇంటి వద్దకు విక్రమ్ వెళ్లి గొడవపడ్డాడు. ఈ గొడవతో నిందితులు సంతోష్‌కుమార్, రేణుకలు రోజాతో గొడవ విషయంపై చెప్పి విక్రమ్‌ను అడ్డు తొలగించుకోవాలని, అడ్డు తొలగిం చేందుకు హత్య చేసేలా పథకం రూపొందించారు. ఈ పథకానికి మృతుడి అక్క సరే అని చెప్పడంతో వారు అదేరాత్రి హత్యకు ప్రణాళిక రూపొం దించుకుని పథకం ప్రకారం రేణుక ఇంటిదగ్గర ఉన్న ద్విచక్రవాహనాన్ని, ఇనుప రాడ్డును తీసుకునివెళ్లి రాత్రి 10 గంటల సమయంలో గ్రామంలో విక్రమ్‌ను వెతుకసాగారు. చీకటిగా ఉన్న ప్రదేశం నుంచి విక్రం వస్తుండగా గమనించిన నిందితుడు సంతోష్ పథకం ప్రకారం చీకటిగా ఉన్న ప్రాంతంలో విక్రంను ఇనుపరాడ్డు కొట్టి, బండరాయితో మోదాడు. దీంతో విక్రం అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య ఘటనపై విచారణ చేపట్టిన ఎస్సై సతీష్ నిందితులు సంతోష్‌కుమార్, రోజా, రేణుకలను అరెస్టు చేసి ఇనుపరాడ్డు, సెల్ఫోన్లు, టాటా ఏస్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను రిమా ండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ హత్య కేసులో నిందితులను ప్రతిభచూపిన ఎస్సై సతీష్, హెచ్‌కానిస్టేబుల్ బిచ్యానాయక్, కానిస్టేబుళ్లు సంపత్, శ్రీను, నాగరాజు, రమేష్‌లను ఎస్పీ కోటిరెడ్డి అభినందించినట్లు సీఐ తెలిపారు.