Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ కమిటీ చైర్మెన్ సదానందం
నూతన వెజిటేబుల్ మార్కెట్ పరిశీలన
నవతెలంగాణ-కాశిబుగ్గ
కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నందున మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు కార్మికులు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ చింతం సదానందం కోరారు. ఇంతేజార్ గంజ్ పోలీసులతో కలిసి శుక్రవారం చైర్మెన్ సదానందం లక్ష్మీ పురం పండ్ల మార్కెట్, వ్యవసాయ మార్కెట్ లలో కరోనా పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై స్వామి, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.
వెజిటేబుల్ మార్కెట్ పరిశీలన
వరంగల్ లక్ష్మీపురంలో నూతనంగా నిర్మించిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్‌ను శుక్రవారం చైర్మెన్ సదానందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నూతన మార్కెట్ ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి కరోనా వైరస్ అధికంగా ఉన్నందున మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ఇతర కొది ్దమంది అధికారులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలిపారు. మార్కెట్ నందు చెత్త చెదారం లేకుండా, బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రం చేపి యవల సినదిగా అధి కారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత శ్రేణి కార్యదర్శి బి వి రాహుల్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రసాదరావు గ్రేడ్ టు కార్యదర్శులు ఓని కుమారస్వామి, తోట చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.