Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు
నవతెలంగాణ-హసన్‌పర్తి
ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు అన్నారు. మండల కేంద్రం హసన్‌పర్తి బస్టాండు ప్రాంతంలో కామారపు కోటిరత్నం-పండరినాథ్, శీలం వివేక్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత వేసవి కాలంలో ఎండల తీవ్రత నుంచి ప్రజలు రక్షణ చర్యలు తీసుకో వాలన్నారు. బస్టాండు ప్రాంతాలలో ప్రధాన కూడళ్లలో ప్రజలకు అందు బాటులో చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం హర్షణీ యమన్నారు. ఈ కార్యక్రమంలో చలివేంద్రం నిర్వాహకులు కామారపు బాలకిషన్, శీలం అతిరథ్వివేక్, అభిరామ్వివేక్, వడుప్సా నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, రజక సంఘం అధ్యక్షులు ఉద రు, కందుకూరి సంజీవ్, ఎలుకరాజు సదానందం, గోపరాజు యాదగిరి, దేవరాజు, వల్లాల రాజు, తాళ్ల మధు, నరెందర్, తదితరులు పాల్గొన్నారు.