Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నవతెలంగాణ-వరంగల్
ఈనెల 12న రాష్ట్ర మున్సిపల్, పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్‌కు రానున్నా రని, నగరంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారు లకు సూచనలు చేశారు. ప్రగతిలో ఉన్న పను లను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్
విప్ దాస్యం వినరుభాస్కర్తోపాటు మంత్రులు సమీక్షించారు. ఇటీవల హైద్రాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయా పనుల ప్రగతి తీరుని అధికారులతో చర్చించారు. ఉగాది నుంచి వరంగల్ నగరంలో ప్రతి ఇంటికీ తాగునీటిని ప్రతిరోజూ ఇవ్వాలన్న నిర్ణయంలో భాగంగా 95 వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. స్లమ్ ఏరియాల్లో తప్పనిసరిగా కనెక్షన్లు అందేలా చూడాలని చెప్పారు. అలాగే రూ.1కే కనెక్షన్ కింద ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మిషన్ భగీరథ పథకం కింద గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటివరకు వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశంలో ఏ నగరానికి లేనివిధంగా తాగునీటిని వరంగల్ నగరానికి అందచేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్‌లోని అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, పారిశుద్ధ్యం, పార్కులు, భవిష్యత్ ప్రణాళికలు, భవిష్యత్తులో చేపట్టబోయే పనులు సత్వరమే పూర్తి చేయాల్సిన పనులపైన మంత్రి సవివరంగా అధికారులతో చర్చించారు.
12న మంత్రి కేటీఆర్ రాక
ఈనెల 12న మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా పలు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, కమిషనర్ పమేలా సత్పతిని ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవాలు, నిరుపేదలకు పట్టాల పంపిణీ, వైకుఠ ధామాలకు శంకుస్థాపన, వరద నాలాలు, నగరంలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, కొత్త పార్కుల ప్రారంభం, వరంగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం, నైట్ షెల్టర్లకు శంకుస్థాపన వంటి పలు కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులు అధికారులకు సూచించారు. మంత్రి కేటీఆర్ పర్యటన రాంపూర్ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గాల్లో వరుసగా కార్యక్రమాలు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ గురించి ఆయా అభివృద్ధి పనుల తీరుతెన్నులపై మంత్రులు అధికారులకు ఆదేశాలిచ్చారు. సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మేయర్ గుండా ప్రకాష్‌రావు, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, డాక్టర్ తాటికొండ రాజయ్య, 'కుడా' చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, తదితరులు పాల్గొన్నారు.