Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో మండలంలోని జబ్బోనిగూడెం గిరిజన గ్రామంలో శనివారం ఉచిత వైద్యశిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కోఆర్డినేటర్ చౌలం సాయిబాబు వివరాలు వెల్లడించారు. శిబిరంలో డాక్టర్ మువ్వ కష్ణారావు గ్రామంలోని సుమారు 48 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా గిరిజనులతో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున ఇంటికే పరిమితమై కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని చెప్పారు. కోవిడ్-19 నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో జగదీష్, కొప్పుల స్వప్న పాల్గొన్నారు.