Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని మంగపేట, చుంచుపల్లి, బ్రాహ్మణపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో శనివారం నిర్వహించిన కోవిడ్ టీకా ప్రత్యేక శిబిరంలో 261 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, వైద్యులు మదుల, అరుణ, ట్వింకిల్ నిఖిత తెలిపారు. మంగపేట ఆరోగ్య కేంద్రంలో 167 మందికి కరోనా టెస్టులు చేసి టీకాలు వేశామని, అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. చుంచుపల్లి ఆరోగ్య కేంద్రంలో 94 మందికి కరోనా టెస్టులు చేసి టీకాలు వేయగా ఒక్కరికి పాజిటివ్ రాగా బ్రాహ్మణపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో 48 మందికి కరోనా టెస్టులు చేసి టీకాలు వేసినట్లు తెలిపారు. మూడు ఆరోగ్య కేంద్రాల పరిధిలో 10 యాక్టివ్ కేసులుండగా 198 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. 45 ఏండ్లకుపైబడ్డ వ్యక్తులు సంబంధిత ఆరోగ్య కేంద్రాలను సందర్శించి టీకా వేసుకోవాలని అధికారులు కోరారు.
ఉచిత వైద్యశిబిరం