Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలో ఒక్క కరోనా కేసు లేకుండా కరోనా రహిత మండలం గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని జెడ్ పి టి సి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ టీకాను వేయించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తరిమి కొట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని దానిని మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి వైద్యులు చెప్పిన విధంగా టీకాను వేయించుకొని అత్యవసర సమయం ఉంటేనే రోడ్డుపైకి రావాలని ని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి మాస్క్ ను తప్పక వాడినట్లయితే కొంతవరకు కరోనా వైరస్ ను తరిమి కొట్టవచ్చునని అన్నారు టీకా తో ఎవరు భయపడవద్దని టీకా వేయించుకోవడం వల్ల కరోనా వైరస్ నుంచి తట్టుకోవచ్చు అని తెలిపారు 45 సంవత్సరాల పైబడి ఉన్న వారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు నేరుగా ప్రభుత్వం వచ్చి కావాల్సిందిగా కోరారు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల్లో చైతన్యం టీకాను వేయించాల్సిన దిగా కోరారు ఈ కార్యక్రమాలు వైద్యాధికారి వరుణ్ తేజ్ సార్ మా సిస్టర్ పద్మ సూపర్వైజర్లు సక్రి .రవి ఏఎన్ఎం రోజారమణి యశోద ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వైద్య సిబ్బంది ఆ సోద భాస్కర్ పాల్గొన్నారు.