Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులను అడ్డుకున్న గ్రామస్తులు
నవతెలంగాణ-చిట్యాల
మండలంలోని చిట్యాల, ఏలేటి రామయ్య పల్లె గ్రామ పంచాయతీల సంబంధించిన గ్రామాల మధ్యలో మామిడి కుంట చెరువు మత్తడి వద్ద ఏర్పాటు చేస్తున్న లో లెవెల్ బ్రిడ్జి ఏర్పాటులో ఆర్అండ్బీ అధికారులు కాంట్రాక్టర్లు ఆర్అండ్బి రోడ్డు మ్యాప్ ప్రకారం వేయడం లేదని ఏలేటి రామయ్య పల్లె గ్రామస్తులు సర్పంచ్ సరోజన లింగ రెడ్డి వార్డు సభ్యులు నరేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువు మత్తడి నుంచి నీళ్ళు వెళ్ళడం కోసం మంజూరైన బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా చెరువును అనుకుని రావడం వల్ల రానున్న రోజుల్లో అధిక వర్షాలతో మామిడి గుంట చెరువు కట్ట తెగిపోయే అవకాశాలు ఉంటాయని బ్రిడ్జి ప్రారంభించిన మొదట్లో అధికారులకు తెలిపామన్నారు. వారు అదేమీ పట్టనట్లు తమ ఇష్టా రాజ్యంగా ఆర్అండ్బి రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని దీంతో మామిడి గుంట చెరువు కరుణాల కుంట చెరువుకట్టకు ప్రమాదం ఉన్నందున అధికారులు రీ సర్వే చేసి బ్రిడ్జి తర్వాత వేసే రోడ్డును ఆర్అండ్బీ రోడ్డు ప్రకారం వేయాలని పనులను అడ్డుకున్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి రీ సర్వే చేసి రోడ్డు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు గ్రామస్తులు ఏలేటి రాజు శ్రీనివాస్ రాజేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.