Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలౌతున్న అమాయకపు ప్రజలు
- చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
నవతెలంగాణ-సంగెం
మండలంలో మొరం మాఫియా కోరలు చాచింది. సంపాదనే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా అక్రమంగా మొరం దందా నిర్వహిస్తున్నారు. వీల్ల దాటికి అభంశుభం తెలియని ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకు నిదర్శనంగా శనివారం జరిగిన సంఘటనే సాక్ష్యం. వివరాల్లోకెల్తే తీగరాజుపల్లి గ్రామ కూడలిలో ద్విచక్ర వాహనంపై నర్సానగర్కు చెందిన రొట్టె దయాకర్ (36) తన స్వగ్రామం తిరిగి వెళుతుండగా ఎదురుగా ట్రాక్టర్ వచ్చి ద్విచక్ర వాహనాన్ని డీకొట్టగా కింద పడ్డాడు. ఆయన పై ట్రాక్టర్ టైర్ చాతి భాగంలో ఎక్కగా అపస్మారక స్థితికి వెళ్లారు. అంబులెన్స్108 అందుబాటులో లేకపోయే సరికి ప్రయి వేట్ వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు విడిఛాడు. చనిపోయిన దయాకర్‌కు కుమారుడు, కూతురు వున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సంగెం ఎస్సై సురేష్ తెలిపారు.మండలంలో కాకతీయ కెనాల్ కాలువ చుట్టూ పక్కల వున్న ఉళ్లల్లో మొరం దందా కొను సాగుతున్న కెనాల్ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ చూసి చూడనట్టుగా వుండి మొరం మాఫియాకు సహకరించకనే సహకరిస్తున్నారు. హద్దూ అదుపు లేకుండా ఓవర్ స్పీడ్ తో మొరం తోలుతున్న ట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ అక్రమ మొరం దందాను ఆపి గ్రామాలల్లో ప్రజలు భయాందోళనకు గురికాకుండా అధికారులు చూడాలని ప్రజలు వేడు కుంటున్నారు. మొరం మాఫియా అనుచరులు క్రమక్రమంగా ఊళ్ళల్లో సైతం తెగబడి అన్ని గ్రామాల్లో 500 నుంచి వెయ్యి రూపాయల వరకు ట్రాక్టర్ మట్టిని విక్రయిస్తున్నారు. వెంటనే ఈ దందాను ఆపాలని ప్రజలు కోరుతున్నారు.