Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాహనాల్లో అధిక కూలీలను తరలిస్తున్న వాహనదారులు
ప్రమాదం జరిగాక నాలుగు రోజులు తూతూ మంత్రంగా చర్యలు
ఉదయాన్నే కూలీలను తరలిస్తున్న వైనం
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-పరకాల
ప్రయాణం మళ్లీ మొదలైంది. అధిక మందిని వాహనాల్లో మళ్లీ తరలిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ములుగు హైవేపై ఆత్మకూరు మండలంలో వ్యవసాయ కూలీలను తరలిస్తున్న ఆటో ప్రమాదానికి గురై మహి ళలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నాలుగైదు రోజులు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ ఆ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ డ్రైవర్లు వ్యవ సాయ కూలీలు మిర్చి పంట ఏరేందుకు ఉదయం ఐదు గంటలకే అంత ర్గత రోడ్డు మార్గాల ద్వారా కూలీలను తరలిస్తున్నారు. పర కాల పట్టణం మీదుగా నిత్యం ఆత్మకూరు, శాయంపేట, మండలాల ప్రజలు రేగొండ చిట్యాల, భూపాలపల్లికి మిర్చి పంటలు ఏరడానికి వెళ్తుంటారు. ఒకే గూడ్సు వాహనంలో సుమాను 30 నుంచి నలబై మంది ప్రయా ణిస్తుంటారు. దీంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని పలువురు వాపో తున్నారు.
ఉదయమే తరలిస్తున్న వాహన డ్రైవర్లు
ఉదయం ఐదు గంటలకే వాహన డ్రైవర్లు కూలీలను తరలిస్తున్నారు. ఈ సమ యంలో అధికారులు ఉండరు. ఎవరు పట్టించుకోరు అనే థీమాతో కూలీలను తరలిస్తున్నారు. మళ్లీ మధ్యాహ్నం కల్లా తిరుగు ప్రయా ణం చేయిస్తున్నారు. వాహనాల్లో అధికంగా వృద్దులు చిన్న పిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఉదయం పూట తరలించడం వల్ల డ్రైవర్లు నిద్ర మత్తులో నడిపే అవకాశం ఉందని దీంతో ప్రమాదాలు జరిగే అవకా శాలూ లేక పోలేదని పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రమాదం జరిగిన నాలుగైదు రోజులే తనిఖీలు
ములుగు జాతీయ రహదారిపై ప్రయాణం జరిగిన నాలుగైదు రోజులు అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. వాహన డ్రైవర్లకు కౌన్సె లింగ్లు నిర్వహించారు. కొన్ని వాహనాలకు జరిమానాలు విధించి వదలి పెట్టారు. కానీ ఆ తర్వాత తనిఖీలు చేపట్ట డంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మళ్లీ వాహ నాల్లో అధిక మందిని యథేచ్చగా తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కువమందిని తీసుకెళ్తున్న టాటా ఏసీ, గూడ్స్, ఆటోల డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుని ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.