Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
వరంగల్ మహానగర పాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి ,హెల్త్ అసిస్టెంట్ అనిల్ అధ్వర్యంలో శనివారం ఆరోగ్య శిబిరంలో అర్బన్ మలేరియా అధ్యక్షుడు నద్దునూరి రాజేష్ కన్నా కోవిడ్ 19 టీకాను వేయిం చుకున్నారు. ఈ సందర్బంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజా రెడ్డి ఈ ఆరోగ్య శిబిరంలో అర్బన్ మలేరియా అధ్యక్షుడు నద్దున్షురి రాజేష్ కన్నాతో పాటు అరవై మంది మలేరియా కార్మికులు టీకాలు వేయించుకున్నారని తెలిపారు. హెల్త్ ఇన్స్పెక్టర్ బాల భద్ర రవి, మధుకర్, హెల్త్ అసిస్టెం ట్ అనిల్, కర్ణాకర్, నరేష్, అర్బన్ మలేరియా ప్రధాన కార్యదర్శి మేకల సమ్మయ్య ఉపాధ్యక్షుడు మైదం ఆరోగ్యం కోశాధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.