Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ తీరును అర్ధం చేసుకోవాలి
- కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సంతోష్
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేట్ టీచర్ల, నిరుద్యోగుల పట్ల మోసపూరిత వైఖరి అవలంభిస్తోందని కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సుంచు సంతోష్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ తీరును అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బచ్చలి లక్ష్మణ్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశానికి సంతోష్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రయివేట్ టీచర్లకు రూ.2 వేలు నగదు సాయంతోపాటు 25 కేజీలు బియ్యం కేవలం ఒక నెలకు మాత్రమే ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాఠశాలలు తెరుచుకునే వరకు నెలకు రూ.10 వేలు చొప్పున సాయం అందించడంతోపాటు క్వింటా బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యం లోనే ప్రయివేట్ టీచర్ల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ బీసీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్టీ సెల్ మండల కార్యదర్శి జాటోత్ సురేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.