Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలోని శివునిపల్లిలో అధికార లాంఛనాలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. అంబేద్కర్ విగ్రహ స్థాపన పనులను అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాలోనే ఈ ప్రాంతంలో స్థాపించే అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతను సంతరించుకుంటుందని తెలిపారు. ఇందుకోసం కషి చేస్తున్న ప్రజాప్రతినిధులను అభినందించారు. నియోజకవర్గంలో శివునిపల్లి గ్రామం అభివద్ధిలో వన్నె సాధించేలా అభివద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సురేష్, వైస్ ఎంపీపీ సుధీర్‌రెడ్డి, డీఆర్డీఓ రాంరెడ్డి, ఎంపీడీఓ కుమారస్వామి, ఎంపీటీసీ గుర్రం రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ తోట సత్యం, గుర్రం ఏసుబాబు, కనకం గణేష్, ప్రసాద్, మల్లేష్, మహేష్, అశోక్, చిట్టిబాబు, శ్రీనివాస్, సోమేశ్వర్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.