Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
కోవిడ్ టీకాపై అపోహలొద్దని మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య చెప్పారు. డివిజన్ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో 14వ వార్డు కౌన్సిలర్ ఎన్నమనేని శ్రీనివాసరావుతో కలిసి శనివారం కరోనా టెస్టింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మెన్ రామచంద్రయ్య మాట్లాడారు. కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని తెలిపారు. ఈ సమయంలో టీకా అందుబాటులోకి రావడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేశారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, మూత్రపిండాలు, కాలేయ, ఊపిరితిత్తుల సమస్యలు తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా కోవిడ్ టీకాను వేయించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా 50 ఏండ్లకుపైబడ్డ వ్యక్తులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ స్టాఫ్ కష్ణమూర్తి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రెండో వార్డులో.. కౌన్సిలర్ తూనం రోజా ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు కరోనా టీకాను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో వార్డు అభివద్ధి కమిటీ సభ్యుడు నల్లపు రాజు, సోమ మల్లేశం, సోమ విజయ, మురళీ, సౌజన్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.