Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య
నవతెలంగాణ-ములుగు
ఈనెల 15 నుంచి 22 వరకు తలపెట్టిన ఆల్బెండజోల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య కోరారు. జాతీ య నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కార్యాలయంలో వైద్యాధికారులకు, సూపర్వైజర్లకు శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలో ఏడాది నుంచి 19 ఏండ్ల వరకు వయస్సున్న పిల్లలు 67 వేల 517 మందికి ఆల్బెండాజోల్ ట్యాబ్లెట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సహకరించాలని కోరారు. పిల్లల వయసును బట్టి ఆల్బెండజోల్ మోతాదు వేసే విధానాన్ని వివరించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ ఏడాది నుంచి 19 ఏండ్ల వయస్సున్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఇస్తారని తెలిపారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మాత్రలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ సీతారామరాజు, వైద్యాధికారులు సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు.