Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జర్నలిస్టుల నిరసనా ర్యాలీ
డీఎస్పీకి, తహసీల్దార్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ-తొర్రూరు
ఆర్యభట్ట హైస్కూల్ కరస్పాండెంట్ నెలకుర్తి మధూకర్రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని జర్నలిస్టుల సంఘాల నాయకులు పస్తం సైదులు, తాటికొండ సదాశివరావు, రంగు లక్ష్మణ్, గొల్లెపల్లి విజరుబాబు, చౌడారపు శ్రీనివాస్, భిక్షపతి, గజ్జెల వినోద్‌రెడ్డి, పంతం సురేందర్ డిమాండ్ చేశారు. పత్రిక విలేకరి సిరికొండ విక్రమ్‌కుమార్‌ను మధూకర్‌రెడ్డి దూషించడం, చంపుతానని ఫోన్లో బెదిరించడాన్ని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల నాయకులు డివిజన్ కేంద్రంలో శని వారం అమరవీరుల స్తూపం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలి పారు. అనంతరం బైక్ ర్యాలీగా వెళ్లి డీఎస్పీ వెంకటరమణకు, తహసీ ల్దార్ రాఘవరెడ్డికి వినతిపత్రం అంందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడారు. కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు తాత్కాలికంగా మూసేస్తూ జారీ చేసిన నిబంధనలను ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యం తుంగలో తొక్కి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుండగా విక్రమ్‌కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని, ఈ క్రమంలోనే విక్రమ్‌కుమార్‌ను స్కూల్ కరస్పాండెంట్ మధూకర్‌రెడ్డి చంపుతానంటూ ఫోన్లో బెదిరించారని చెప్పారు. మధూకర్రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తొర్రూరు, నెల్లికుదురు, నర్సింహులపేట, దంతాలపల్లి, పెద్దవంగర మండలాల విలేకరులు ఇమ్మడి రాంబాబు, జిలుకర రాజు, లకావత్ యాదగిరి, బందు శ్రీధర్, దొంగరి శ్రీనివాస్, మహేష్, పంతం సురేందర్, అమీర్, బూరుగు శ్రీకాంత్, పూర్ణచందర్, సాంబ, యాకయ్య యాదవ్, భానుప్రసద్, రవి, ఓంకార్, దామోదర్, విజరు, తదితరులు పాల్గొన్నారు.