Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పెద్ది
నవతెలంగాణ-ఖానాపురం
దశాబ్ధాల కాలంగా ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పాఖాల సరస్సులోకి చేరడంతో పాఖాల రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని దబ్బీర్ పేట గ్రామ శివారులోని దబ్బ వాగునుంచి పాకాల సరస్సులోకి గోదావరి జలాలు చేరిన సందర్బంగా కీర్య తండా - గుండం గ్రామాల మధ్యనగల బ్రిడ్జ్ వద్ద నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాటా ్లడుతూ సీఎం కేసీఆర్ రామప్ప నుంచి గోదావరి జలాలను పాకాలకు మళ్లించేటువంటి ప్రాజెక్టును మంజూరు చేయడంతో రాత్రంబవళ్ళు కష్టపడి దానిని సకాలంలో పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. గోదావరి నది నుంచి క్రిష్ణ వరకు జలాలు పరిగెత్తుతుంటే ఆ సన్నివేశాన్ని ఆనం దాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. పాకాల అయకట్టు కింద రెండో పంటకు నీళ్లు ఇచ్చే బహుళార్ధక ప్రాజెక్టుకు ఈ రోజు ట్రయిల్ రన్ చేయం శుభ సూచికమన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 130 రోజుల పాటు నీటిని నింపు కునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడిసీఎంఎస్ ఛైర్మన్ రామస్వామి, జెడ్పీ వైస్ చైర్మెన్ మురళిదర్, మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజని-కిషన్, ఎంపీపీలు ప్రకాష్ రావు, ఊడ్గుల సునిత-ప్రవీణ్ పాల్గొన్నారు.