Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
వరంగల్ అర్బన్ అండ్ రూరల్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి తనయుడు నాయిని విశాల్ రెడ్డి మెమోరియల్ చాంపి యన్షిప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సెషన్-1ను శనివారం ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజిలో నాయిని రాజేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎన్వీఎం చాంపియన్షిప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ విజేతకి లక్ష రూపాయల బహుమతి, రన్నరప్ యాబై వేల ప్రైజ్ మనీ అందజేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు క్రీదాకారులపట్ల నిర్లక్ష్యం వహిస్తు న్నారని, సరిపడా నిధులు కేటాయించి నిస్వార్ధంతో ప్రోత్సహిస్తే మాని క్యాల్లాంటి క్రీడాకారులు దొరికే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రాం రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఈవీ శ్రీనివాస్ రావు, టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ పులి అనిల్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అంబేద్కర్ రాజు, నాగపురి దయాకర్, సాయి రాం యాదవ్, బంక సతీష్ యాదవ్, కొత్తూరు రాజేష్, గాండ్ల స్రవంతి తదితరులు పాల్గొన్నారు.