Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానున్న ఎన్నికల్లో విజయం తథ్యం
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే
నన్నపునేని నరేందర్
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ఈ నెల 12న వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేస్తున్న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. శనివారం శివనగర్‌లోని సాయి కన్వెన్షన్ సెంటర్లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ తూర్పులో సుమారు రూ.లు 350కోట్లతో చేపడుతన్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళను, పార్టీ, ప్రజల కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివద్ధి కార్యక్రమాలు బూత్ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెెళ్లాలని సూచించారు. అందరిని గుర్తించి గౌరవించుకుంటామని, అంతిమంగా పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామని తెలిపారు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేపడితే సహించబోనన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గుండేటి నరేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌బాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.