Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జె.సుధార్ సింగ్
నవతెలంగాణ-భూపాలపల్లి
కరోనా పట్ల నిర్లక్ష్యం వహించొద్దని జయశంకర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జె.సుధార్ సింగ్ అన్నారు. శనివారం కాటారం, తాడిచెర్ల, మహాదేవ్ పూర్, కాళేశ్వరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి డాక్టర్లకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు సూచ నలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర సంచాలకులు మరియు డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లను పెట్టి కుటుంబ సభ్యులకే కాకుండా గ్రామ స్తులందరికీ ఆర్టీపీసీఆర్, రాట్ టెస్ట్ లను నిర్వహిస్తు న్నామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు తప్పకుండా ఉపయోగించాలని , ఒకరినుంచి ఒకరికి రక్షిత దూరం పాటించాలన్నారు. తరుచుగా చేతుల శుభ్రత పాటిం చాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మందులు ఆపవద్దని, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ లేదా సిబ్బందిని కలిసి సేవలు పొందాలన్నారు.