Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటారం డీఎస్పీ బోనాల కిషన్
నవతెలంగాణ-మహాదేవపూర్
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని కాటారం డీఎస్పీ బోనాల కిషన్ పిలుపునిచ్చారు. మండలంలోని కాళేశ్వరంలో శనివారం షాపుల యజమానులు ఆటో డ్రైవర్లకు గ్రామస్తులకు ర్యాలీ నిర్వహించి మాస్క్‌లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి షాపు యజమాని మాస్కు ధరించి ఇతరులకు ధరించేలా చూడాలన్నారు. ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు గ్రామస్తులు ఇంటి నుంచి బయటికి రాగానే మాస్కు పెట్టుకొని రావాలనే ఈ మధ్యకాలంలో మహదేవపూర్ మండలంలోని ఎడపల్లి మజిద్ పల్లి ఇప్పుడు బోరు పలుగులా ఇతర గ్రామాల్లో కరోనా చాప కింద నీరుగా వ్యాపిస్తుందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు ధరించని యెడల జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ లు నరహరి, అనిల్ కుమార్, ట్రైనీ ఎస్ఐలు సివిల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.