Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.7.40 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన
- విలీన గ్రామాల అభివృద్దికి ఎమ్మెల్యే పెద్ద పీఠ
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధి హసన్‌పర్తిలో శనివారం అభివృద్ది పనుల జాతర కొనసాగింది. అభివృద్ది పనుల ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల కోసం వచ్చి వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు జనం నీరాజనం పలికారు. డప్పు చప్పుళ్లతో కోలాటాలతో వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హసన్‌పర్తి, ఎల్లాపూర్‌లో రూ.7.40కోట్ల నిధులతో పలు అభివద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్లలో అభివద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ హాసన్ పర్తిలో రూ.5 కోట్లు, 55వ డివిజన్ ఎల్లాపూర్‌లో రూ.2.40 కోట్లతో చేపట్టిన పలు అభివద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్లు విలీన గ్రామాలతో కూడి ఉన్నాయని విలీన గ్రామాలలో పట్టణ వాతావరణం తీసుకువచ్చే విధంగా కషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాగమల్ల ఝాన్సీలక్ష్మీ, డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, దేవస్థానం చైర్మన్ పిట్టల సదానందం, పీఏసీఎస్ చైర్మన్ బిల్ల ఉదరుకుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కందుకూరి చంద్రమోహన్, అంచూరి విజరుకుమార్, మల్లారెడ్డి, నేదునూరి కుమారస్వామి, వీసం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.