Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూశాయంపేట
ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి అండగా నిలవాలని సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ రైతుల సంఘీభావ సభను బ్రిటీష్ వలస పాలనలో రైతులపై దోపిడీకి వ్యతిరేకంగా (బీహార్) చంపారన్‌లో గాంధీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష (1917)ను స్మరిస్తూ వరంగల్ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్ట్ బండి దుర్గాప్రసాద్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరూప్‌రెడ్డి, యాదగిరి మాట్లాడారు. తొలుత ఆదివాసీలు భారతదేశంలో పోరాటం చేశారని తెలిపారు. రంజి గోండు వంటి వారి చరిత్రను వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు. నాటి వలస పాలనలో ఆంగ్లేయులు, తెలంగాణలో నిజాం, దేశాయి, దొరలు రైతులను గోసపెట్టారని తెలిపారు. అందుకే సాయుధ పోరాటం వచ్చిందన్నారు. నాడు గాంధీ 1917లో చంపారన్‌లో రైతులపై దాడికి వ్యతిరేకంగా సత్యాగ్రహం పాటించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని చెప్పారు. రైతుల పోరాటాలకు మద్దతు ఇవ్వడాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని ఆకాంక్షించారు. అనంతరం అడ్వకేట్ సునీల్ మాట్లాడారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక నాయకుడు డాక్టర్ తిరుపతయ్య, అడ్వకేట్ సునీల్‌కుమార్, పౌర స్పందన వేదిక కన్వీనర్ నల్లెల రాజయ్య, రైతు స్వరాజ్య వేదిక తరపున బీరం రాము పాల్గొన్నారు.