Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్వో వ్యవస్థ రద్దుతో కొట్టుమిట్టాడుకుంటున్న వీఆర్వోలు
- విధులు లేక ఆరు నెలలుగా ఎదురుచూపులు
నవతెలంగాణ-శాయంపేట
గ్రామాలలోని వ్యవసాయ భూముల రికార్డుల సవరణకు నియ మించిన పట్వారి వ్యవస్థ క్రమేపీ వీఏఓగా మారి, వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసిన వీఆర్వోలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడంతో ఆరు నెలలుగా విధి నిర్వహణ లేక ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వం వీఆర్వోలకు ప్రతి నెల వేతనం చెల్లిస్తున్నప్పటికీ వారికి విధులు కేటాయించలేదు. శాయంపేట మండలంలో 13 రెవెన్యూ గ్రామాలుండగా 11 మంది వీఆర్ఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ గతేడాది సెప్టెంబర్ నెలలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడంతో అప్పటి నుంచి వారికి విధులు కేటాయిం చకపోవడంతో ఖాళీగా ఉండాల్సి వస్తుందని వీఆర్వో లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్వారీ నుంచి వీఆర్వో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామాలలోని వ్యవసాయ భూముల రికా ర్డుల కోసం పట్వారీ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. తదనంతరం పట్వారీలను గ్రామ అభివద్ధి అధికారి (విఏవో)గా నియామకం చేపట్టారు. అలా కొనసాగుతూనే పంచాయతీ శాఖలో విలీనం చేసి పంచాయతీ కార్య దర్శులుగా నియమించారు. వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) వ్యవస్థను ఏర్పాటు చేసి 63 రకాల విధులను అప్పగించారు. వీఆర్వోలు గ్రామాలలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిపాలన కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీఆర్వోలు గ్రామాల్లోనే కార్యాలయాలు ప్రారంభించి విధులు నిర్వర్తిస్తున్నారు. వీఆర్వోలు రైతుల భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి పహానిలో భూములు నమోదుచేసి భూ రికార్డులు నమోదు చేసేవారు. సాధారణ పరిపాలన, రెవెన్యూ విధులు, పోలీస్ విధులు, సామాజిక సంక్షేమ అభివద్ధి తో పాటు ఇతర విధులు నిర్వర్తిస్తూ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. అతివష్టి, అనావష్టి, వడదెబ్బ బాధితులు, అగ్ని ప్రమాదాలు, రేషన్ పంపిణీ, ధ్రువీ కరణ పత్రాల విచారణలో వీఆర్వో లదే క్రియాశీలక పాత్ర. రెవెన్యూ కార్యాలయంలో జారీ చేసే ధ్రువీకరణ పత్రాల విచారణ బాధ్యత మొట ్టమొదటిగా వీఆర్వోలదే. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర వేయడంలో వీఆర్వోలు క్రియాశీలక పాత్ర పోషించారు.
వీఆర్వో వ్యవస్థ రద్దు తో కుదేలు
సీఎం కేసీఆర్ గతేడాది సెప్టెంబర్ నెలలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వీఆర్వోలు చేయాల్సిన విధులు ప్రభుత్వం అప్పగించక పోవడంతో ఆరు నెలలుగా ఖాళీగానే ఉంటూ విధులు లేక కొట్టుమిట్టాడు కుంటున్నారు.
విధులు అప్పగించాలి
వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడంతో ఆరు నెలలుగా విధి నిర్వహణ లేక ఖాళీగా ఉంటున్నాము. విధులు అప్ప గించి నట్లయితే విధి నిర్వహణ చేసుకుంటూ ప్రజలతో మమే కమై పని చేస్తాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఓ వ్యవస్థపై దష్టి సారించి డిప్యూటేషన్ చేసి విధులు అప్పగించి వీఆర్వోలకు న్యాయం చేయాలి.
- బిక్షపతి వీఆర్వోల సంఘం మండల ఆధ్యక్షులు