Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కాజిపేట
కాజీపేట పట్టణ డీజిల్ కాలనీ చౌరస్తాలో ఏడు నెలల క్రితం తవ్విన గుంత వలన డ్రయి నేజీ మూసుకుపోయి చుట్టుపక్కల ఇండ్లలో నుంచి వస్తున్న మురుగునీరు వెళ్లడానికి దారి లేక జాతీయ రహదారిపై నిలు స్తుంది. మున్సిపాలిటీ అధికారుల కు ఫిర్యాదు చేసినా స్థానిక ప్రజలు ధర్నాలు చేసినా ఇంతవరకు ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారి వెంట ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు పోతున్నారు కానీ ఏ ఒక్కరూ పట్టించు కోవడంలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నందున ఆదివారం మున్సిపల్ వాటర్ 3 గంటల సేపు వదిల ేయడంతో నీరు పోయే దారి లేక రహదారిపై నీళ్లు నిలిచాయి. మున్సిపాలిటీ అధికారులు నీరు నిలువకుండా ఉండేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆ పని శాశ్వత పరిష్కారం చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. కేటీఆర్ అదే దారి గుండా వెళ్లేటప్పుడు అక్కడి స్థానికులు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకొని మా సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతామని డీజిల్ కాలనీ స్థానిక ప్రజలు తెలిపారు. అధికారులు వస్తేనే ఆర్భాటంగా తాత్కాలికంగా పనులు చేస్తూ ప్రజా సమస్యలు మరిచి పారణ చేస్తున్నారని ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని వారు వాపోతున్నారు.