Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యూ) అర్బన్ జిల్లా కార్యదర్శి పనాస ప్రసాద్
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ఎన్నికల హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఎంసీపీఐ(యూ) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి పనాస ప్రసాద్ విమర్శించారు. ఆదివారం ఎంసీపీఐ(యూ) ఎస్‌ఆర్‌ఆర్‌తోట శాఖ ఆధ్వర్యంలో కరీమాబాద్‌లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని, ఖిలా వరంగల్ శాఖ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఖిలా వరంగల్‌లో గ్రంథాలయం, ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ పైపులైన్ల తవ్వకాల వల్ల రోడ్లు గుంతలమయం అయ్యాయని, వెంటనే వాటిని సరిచేయాలన్నారు. శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. కరీమాబాద్, ఉర్సు ప్రాంతంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల వద్ద నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా పన్నులను వసూలు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్ రైల్వే గేట్ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యనికి గురయిందని, వెంటనే పాలకులు సమస్యలు పరిష్కరించాలని లేదంటే రానున్న రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నర్ర ప్రతాప్, ఎగ్గని మల్లిఖార్జున్, మండల కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు మాలి ప్రభాకర్, ఆవునూరి నర్సయ్య, రాయినేని అయిలయ్య, నరహరి, సూరయ్య, రవి, నర్ర అశోక్, వల్ల కృష్ణ, పిట్ట యాదగిరి, బొంత మార్కండేయ, బొంతుల రాజేందర్ పాల్గొన్నారు.