Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఘనంగా మాజీ కార్పొరేటర్ దంపతులకు ఆత్మీయ సన్మానంనవతెలంగాణ-ఖిలా వరంగల్
శివనగర్ అభివృద్ధిలో స్థానిక ప్రజలందరం భాగస్వా ములవుదామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. ఆదివారం శివనగర్‌లోని పద్మశాలీ కల్యాణమండపంలో మాజీ కార్పొరేటర్ శామం తుల ఉషశ్రీనివాస్ దంపతులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం సామాజిక వేత్త గట్ల రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మోడల్ డివిజన్లో భాగం గా శివనగర్, పెరుకవాడ, గోవిందరాజుల గుట్టను అభివృద్ధి చేశామ న్నారు. ఆలయాలను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. 18వ డివిజన్లో అండర్ డ్రెయినేజీ నిర్మాణం జరుగుతున్నట్టు తెలిపారు. డివిజన్ అభివృద్ధికి శామంతుల ఉషశ్రీనివాస్ దంపతులు శాయశక్తులా కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ దంపతులు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ దంపతులను స్థానిక పెద్దలు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, సాధుల దామోదర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీదర్ రెడ్డి, మంచాల కృష్ణమూర్తి, వడ్నాల మల్లయ్య, బ్రిజ్ గోపాల్, కన్వీనర్ బుధారపు భాస్కర్, ఆడెపు శ్యాం, పోలేపాక నరేందర్, అమ్జద్, సింగం కుమార్, వెంకట నర్సయ్య, చింతం యాదగిరి, కందగట్ల భాస్కర్, విజయ రాంచదర్, అంజమ్మ పాల్గొన్నారు.