Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో యువత ముం దుండాలని సీఐ రమేష్ అన్నారు. ఆదివారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడు కలను పురస్కరించుకుని రాజంపేట అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిరావు పూలే చిత్ర పటానికి ఘననివాళులర్పించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ భవన్ అభివద్ధి కమిటీ అధ్యక్షులు ఒంటేరు బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అనేక సంస్కరణలతో పాటు విద్య అభివద్ధికై అనేక మైన కషి చేసిన గొప్ప కషివలుడు జ్యోతిరావు పూలే అని కొనియడారు. నేటి యువత విద్యా రంగంతో పాటు అన్ని రంగాల్లో సైతం నైపుణ్యతను పెంపొం దించుకొని పోటీ ప్రపంచంలో సత్తా చాటు టకు మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యా యులు వెంకటేశ్వరరావు, అంబేద్కర్ అభివద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు మేకల దేవయ్య, బొబ్బిలి సభ్యులు సుమన్, నరసయ్య, స్వామి, కొయ్యడ శ్రీనివాస్, కౌన్సిలర్ రాజు, నరేష్, సుమన్, రాజు తదితరులు పాల్గొన్నారు.