Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేసీఆర్ చొరవతోనే పాకాలకు గోదావరి జలాలు
ఇక కాల్వల పునర్నిర్మాణం
రెండో పంటకు సాగు నీరు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
ఎన్నో అడ్డంకులను చేధించి రైతుల కలనెరవే ర్చామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలం గాణ ఉద్యమకారుడుగా సీఎం కేసీఆర్ వెంట నడిచి నేర్చుకున్న పాఠాలతో నియోజవర్గాన్ని సశ్యశామలం చేయాలనే సంకల్పంతో ఇరిగేషన్ సర్క్యూ ట్ రూపొం దించామన్నారు. నాలుగేండ్ల క్రితం నాడు ఎమ్మెల్యే కాకున్నా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి హరీష ్‌రావు రంగయ్య చెరువు, పాకాలను సందర్శించి ఇక్కడే ఉన్నత ఇంజనీరులతో ప్రాజెక్టుల రూపకల్పనపై సమీక్షించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌తో సన్ని హిత్యంతో నిధులను మంజూరు చేయించి గోదావరి జలాలను పాకాలకు తీసుకొచ్చే బృహత్తర కార్యక్ర మానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎన్నో అడ్డంకులు, అవం తరాలను, రాజకీయ కుట్రలను చేధించి చివరకు పాకాల రైతు కలను నెరవేర్చామని తెలిపారు. సమీప నియోజర్గంతో సమన్వయం, ఇంజనీర్ల అంకితభావం, అటవీ శాఖ అధికారుల సహకారం, అనేక మంది కార్మికుల శ్రమతో ఈ ప్రాజెక్టు సాధ్యపడిందని వారందరికి కృతజ్ఞతలు చెప్పారు. ఇరిగేషన్ సర్క్యూట్ రూపకల్పనలో తమ అనుభావాలను పంచాలని అన్ని రాజకీయ పార్టీలను, ఇంతకు ముందు పదవులను అనుభవించిన ఎమ్మెల్యేలను విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రాజెక్టులపై సలహాలు ఇవ్వకపోగా ప్రాజెక్టులపై ఎం జరుగుతుందో తెల్సుకోనే ప్రయత్నం చేయకుండా అవహేళన చేసి ప్రజల్లో అయోమయం సృష్టించారని తెలిపారు. ప్రత్యేక సాంకేతిక నిష్టాతులచే రంగయ్య, పాకాల పైప ్లైన్ల అనుసంధానం చేశామని, ఎక్కడ అవంతరాలు ఎదురైనా పైప్‌లైన్ డైవర్షన్ ద్వారా రెండు రిజర్వా యర్‌లోకి నీరు చేరుతుందని తెలిపారు. సరస్సులో చేరిన ప్రతి నీటి బొట్టు వృధా కాకుండా చెరువు కింద మేయిన్ కాల్వల నుంచి పంట కాల్వల వరకు పునర్మి ర్మాణం చేయాల్సిన అవసరం ఉంద న్నారు. వంద యేండ్లుగా కాల్వలన్నీ ధ్వంసమౌతూ వచ్చాయని తెలి పారు. వీటన్నింటినీ పునర్మిర్మాణం చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే డీపీఆర్‌ను రూపొం దిం చాలని ఉన్నత ఇంజనీర్లను ఆదేశించారని తెలిపారు. 99 కిలో మీటర్ల నిడివి కలిగిన తుంగం బంధం, జాలుబంధం, సంగెం వంటి తది తర ప్రధాన కాల్వల పునర్మిర్మాణం చేయడానికి రూ.240 కోట్ల అంచనా వ్యయం అవసరమౌతుందని డీపీఆర్ అందించారని చెప్పారు. కాల్వల పునర్మిర్మాణం చేయడం వల్లనే రెండో పంటకు 30 వేల ఎకరాల ఆయ కట్టుకు సాగు నీరందతుందని అభిప్రా య పడ్డారు. క్రాఫ్ హాలిడే ప్రకటిం చైనా కాల్వలన్నీ పునర్మి ర్మాణం చేసి పూర్తి స్థాయి ఆయకట్టంతటికీ సాగు నీరందిస్తామని చెప్పారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు వివిధ దశలో పురో గతిలో ఉన్నాయని వీటి ద్వారా అదనపు ఆయకట్టు సాగు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిం చేందుకు 179 మోడల్ విలే జ్లుగా తీర్చిదిద్దాడానికి సంకల్పిం చామన్నారు. ఈ మేరకు అధికారులు తగిన ప్రణాళికలను రూపకల్పన చేసే ప్రక్రియలో ఉన్నారని తెలిపారు. ఊగాది కొత్త యేడాదిలో పనులు ప్రారంభ మౌతాయన్నారు. ఈ సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మెన్ గుగులోతు రామస్వామి, మహబూబాబాద్ మార్కెట్ చైర్మెన్ రంగయ్య పాల్గొన్నారు.