Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
వ్యాపారంలో మహిళలు రాణించి ఆర్థికంగా అభివద్ధి చెందాలని ఏపీడీ నూరొద్దీన్ మహిళలకు సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో వ్యాపార రంగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వ్యాపారం చేసుకునేందుకు 190మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా గుర్తించామన్నారు. వారి వ్యాపారం కోసం నాలుగు కోట్లు వెచ్చిస్తున్నామని, మే మొదటి వారం నుంచి వ్యాపారాలు ప్రారంభించాలని అన్నారు. వ్యాపారం కోసం తీసుకున్న అప్పులను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు. అప్పుడే పారిశ్రామికవేత్తలుగా గుర్తింపు పొందిన మహిళలకు సార్ధకత ఉంటుందన్నారు. వ్యాపారం చేసుకు నేందుకు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాచకొండ రమణాచారి, సీసీలు, మహిళలు పాల్గొన్నారు.