Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు రవీందర్
నవతెలంగాణ-పాలకుర్తి
కరోనా కట్టడి పై ప్రజలను చైతన్యం చేసి వారికి అవగాహన కల్పించేందుకు యువకులు చేస్తున్న కషికి అండగా ఉంటానని మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంట రవీందర్ అన్నారు. పాలకుర్తి కి చెందిన యువకుడు రామ్ సర్దార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న షార్ట్ ఫిలిం ప్రోమోను గంట రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మనిషి రూపంలో ఏ విధంగా ఉంటుందనే వాటిపై ప్రజలకు యువకులు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. వారి కషిని ప్రోత్సహిస్తూ వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జఫర్గడ్ ఎంఈఓ రాజేందర్ పాలకుర్తి మాజీ ఏమ్ఈఓ పోతుగంటి నరసయ్య, లియో క్లబ్ అధ్యక్షులు గజ్జి సంతోష, ఆర్యవైశ్య సంఘం మండల నాయకులు బొగ్గరపు నాగరాజు, సోమేశ్వర్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.