Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే టి రాజయ్య
నవతెలంగాణ-లింగాలఘనపురం
గొప్ప సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలె అని స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య అన్నారు. ఆదివారం మండలం లోని నెల్లుట్ల బైపాస్ రోడ్ లో ఫూలె 195వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహాను భావుడు, స్త్రీలు చదువుకోవాల్సిందే అని పట్టుబట్టి ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. బడుగు, బలహీన, పీడిత వర్గాలకు అండగా నిలిచిన పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అన్నారు. సత్య శోధక్ సమాజ్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి బలహీన వర్గాల తరఫున పోరాడారని గుర్తు చేశారు. అలాగే మండలం లోని కళ్లెం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబెద్కర్ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే జయంతిని నిర్వహించారు. ఈకార్యక్రమంలో సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్ , రాష్ట్ర నాయకులు సెవెల్లి సంపత్, దిశా కమిటీ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దూసరి గణపతి, ఎంపీటీసీ సిద్దు, సీనియర్ నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మెన్ ఆగా రెడ్డి, డైరెక్టర్ బూడిద రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు యాకన్నతోపాటు నాయకులు అంతగల్ల రామచందర్ రైతు గ్రామ కో-ఆర్డినేటర్ సుధీర్ రెడ్డి , నాయకులు రామకృష్ణ, వీరస్వామి , ఎల్లస్వామి, ఆనంద్, మధు పాల్గొన్నారు.