Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వ్యాక్సిన్ మహౌత్సవ్ నిర్వహిస్తున్నామని డీఎంహెచ్ఓ జె సుధార్ సింగ్ అన్నారు. జిల్లావ్యాప్తంగా పీహెచ్సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సింగరేణి ఏరియా ఆస్పత్రులను ఆయన ఆదివారం పర్యవేక్షించి మాట్లాడారు ఉదయం 9 గంటల నుండి సాయింత్రం 5 గంటల వరకు 45 ఏంట్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నామని, జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారని అన్నారు. వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పండుగలు, రెండవ శనివారం, ఆదివారం సెలవులు తీసుకోకుండా సేవలందిస్తున్నారని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకొని కరోనా కట్టడికి సహకరించాలన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ ధరించాలని అన్నారు. ప్రజలు అప్రమత్తతో ఉండాలని, గుంపులు గుంపులుగా ఉండొద్దన్నారు. సామూహిక భోజనాలు, పండుగలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తుమ్ములు,దగ్గు,జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం వీడి కరోనా టెస్ట్లు చేయించుకోవాలన్నారు. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో 1827 మందికి వ్యాక్సిన్ వేశామని తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న గ్రామాల్లో మెడికల్ క్యాంప్లు పెట్టి ఆర్టిపిసిఆర్, రాట్ టెస్ట్లు నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని పీహెచ్సీల్లో కరోనా నిర్ధారిత పరీక్షలు, కరోనా వ్యాక్సినేషన్ చేపడుతున్నామని అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామవాసి, ఉపాధ్యాయుడు కరోనా బారిన పడి జనగామ జిల్లాలో చికిత్స పొందుతూ అక్కడే మరణించారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నిబంధనలు తప్పక పాటించాలన్నారు.