Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగామ పోలిస్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణపై అవగాహనా సదస్సు
నవతెలంగాణ-జనగామ
పాల్గొని ప్రజలకి కరొన నియంత్రణకై పలు సూచనలు చేయడమైనది, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సెకండ్‌వేవ్ విస్తరిస్తున్నందున, ప్రజలు సామాజిక దూరం పాటించడంతోపాటు ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని, లేదంటే చర్యలు తీసుకోవడంతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తామని వెస్ట్‌జోన్ డీసీప శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం వరంగల్ సీపీ తరుణ్ జోషి ఆదేశాల మేరకు జనగామ పోలీసుల ఆధ్వర్యంలో జనగామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అందరూ శానిటైజర్ వాడాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. దూరపు ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని, కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తే సాధ్యమైనంత త్వరలో కరోనా నియంత్రించగలమని అన్నారు. పట్టణ సీఐ మల్లేశ్ , ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కఠిన చర్యలు : సీఐ శ్రీనివాస్‌రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్ : మాస్కు లేకుండా బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ ఎడవెళ్లి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఆదివారం డివిజన్ కేంద్రంలో బస్టాండ్, పలు దుకాణాల వద్ద ప్రజలకు కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించి ఆయన మాట్లాడారు. మాస్కులు లేకుండా ద్విచక్ర వాహనదారులు, ఆటోలోని ప్రయాణికులు తిరిగితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. కిరాణా, వస్త్ర దుకాణాలు , బేకరీ, ఇతర వ్యాపార సముదాయాల్లో మాస్క్ లేకుండా ఎవరు కనిపించినా సదరు యజమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాస్క్ ధరించని వారికి ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న పదిమంది పై కేసు నమోదు చేస జరిమానా విధించినట్టు చెప్పారు. ఎస్సైలు రమేష్, మోహన్‌బాబు, మహేందర్, కానిస్టేబుల్ కుమార స్వామి, రవికుమార్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
కరోనా వ్యాక్సిన్ ఛాలెంజ్ స్వీకరించాలి
మహాదేవపూర్ : ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ ఛాలెంజ్ స్వీకరించాలని పీఏసీఎస్ చైర్మెన్ చల్ల తిరుపతిరెడ్డి అన్నారు. ఆదివారం హాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో కరోనా టీకా తీసుకున్న అన్తంరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ ఛాలెంజ్‌లో భాగస్వాములవ్వాలని అన్నారు. తన ఛాలెంజ్‌ను స్వీకరించాలని అన్నారు. కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
వ్యాక్సిన్‌పై అపోహలొద్దు : జెడ్పీటీసీ
చిట్యాల : కరోణ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని జెడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. ఆదివారం మండలంలోని జూకల్ గ్రామంలో సర్పంచ్ మహేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా వాక్సినేషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 45 ఏండ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నట్టు తెలిపారు. మొదటి వాక్సిన్ స్థానిక సర్పంచ్ పుట్టపాక మహేందర్ తీసుకున్నారని, అన్ని పీహెచ్సీ కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అన్నారు. తాసిల్దార్ రామారావు డాక్టర్ నాగరాణి, ఎంపీటీసీ జంబుల తిరుపతి, ఉప సర్పంచ్ చాడ ఆనంద్‌రెడ్డి, నాయకులు దావు వీరారెడ్డి, పంచాయతీ కార్యదర్శి బొద్దిరెడ్డి దేవేందర్‌రెడ్డి, దామెర రాజు, తదితరులు పాల్గొన్నారు.
కరోనా కట్టడికి పాటుపడాలి : ఎంపీపీ
మల్హర్రావు : ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనా కట్టడికి కృషి చేయాలని ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం తాడిచెర్ల ప్రభుత్వ కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ విధానాన్ని ఎంపీడీఓ, తహసీల్దార్లతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాస్కులు తప్పకుండా ధరించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు దుబ్బపేట, వల్లేంకుంట, కొయ్యుర్, మల్లారం తదితర గ్రామాల్లో కార్యదర్శులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలను ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించారు. ఆదివారం మొత్తం 130 మందికి కరోనా వ్యాక్సిన్, 110 మందికి కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించినట్టు ఇన్చార్జి వైద్యాధికారి గోపీనాథ్ తెలిపారు.
198మందికి కరోనా టీకాలు
మహాదేవపూర్ : మండలంలోని అంబటిపల్లి కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆదివారం 198మందికి కోవిద్-19 టీకాలు వేసినట్టు ఇన్చార్జి వైద్యాధికారిరామారావు తెలిపారు. కాగా మహాదేవపూర్‌లో ఇద్దరికి, కాలేశ్వరంలో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని, 45ఏండ్లు పైబడిన వారు కరోనా టీకా తీసుకోవాలని అన్నారు.
మాస్కులు లేకుంటే చర్యలు : ఎస్సై సతీష్
పాలకుర్తి : మాస్కులు ధరించకుంటే చర్యలు తప్పవని ఎస్సై గండ్రాతి సతీష్ హెచ్చరించారు. ఆదివారం పాలకుర్తిలో ద్విచక్ర వాహనదారులకు ఆటోడ్రైవర్లకు వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. రెండవ దశ కరోనా వైరస్ విజంభిస్తోందని, మేలో మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. మాస్కులు ధరించకుండా బయట తిరిగేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మాస్కులు లేకుండా వచ్చే ప్రయాణికులను ఆటో డ్రైవర్లు దింపి వేయాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్లపై చర్యలు తప్పవన్నారు. కిరాణం షాప్‌లతోపాటు ఇతర షాపులకు వచ్చే వినియోగదారులు మాస్కులు ధరించి వస్తేనే వస్తు వులు ఇవ్వాలని అన్నారు.
వ్యాక్సినేషన్ తీసుకోవాలి
రేగొండ : 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్-19 టీకా తీసుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారి మమతాదేవి, స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో సురేందర్ అన్నారు. ఆదివారం మండలంలోని చెన్న పూర్, దామరంచపల్లి గ్రామాల్లోని ప్రజలకు చిన్నపూర్ స్కూల్ ఆవరణలో వ్యాక్సినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. దామరంచపల్లి గ్రామం, చిన్నపూర్ గ్రామంలో వైద్య సిబ్బంది, సర్పంచులు కలిసి ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. రెండు గ్రామాల్లో 121మందికి వ్యాక్సినేషన్ వేశారు. అలాగే స్థానిక పీహెచ్సీ సెంటర్ లో 50మందికి మొత్తంగా 170మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు తెలిపారు. సర్పంచులు జూపాక నీల నీలాంబరం, ప్రణతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి : అదనపు ఎస్పీ
భూపాలపల్లి : అత్యవసర సమయంలో బయటకెళ్లినపుడు విధిగా మాస్కు ధరించాలని, లేదంటే జరిమానా విధిస్తామని అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనవసర ఫంక్షన్లు, పార్టీలు, విందులు నిర్వహించొద్దని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ ఉపయోగించాలన్నారు. ప్రతి ఒక్కరు కరోనా టీకా తీసుకోవాలని, ఎలాంటి అపోహలకు గురికావొద్దన్నారు. మాస్కులు లేకుండా బయట తిరిగినా, విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మాస్కులు ధరించని వారిని దుకాణ సముదాయాల్లోకి, ఇతర పబ్లిక్ ప్రదేశాలు, ఆలయాలు, మసీదుల్లోకి అనుమతించొద్దని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలిస్ స్టేషన్‌కు వచ్చేవారు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గంగపురిలో విస్తృతంగా కరోనా పరీక్షలు
కాటారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, దామెరకుంట ఆరోగ్య ఉపకేంద్రం పరిధి శివారు గ్రామం గంగపురిలో 19 కరోనా కేసులు నమోదయ్యాయని, అందరికి కరోనా వ్యాపించకుండా ఆదివారం గ్రామంలో జిల్లా రాపిడ్ ఆక్షన్ టీమ్ ఇంటింటికి సందర్శంచి 148 మందికి కరోనా నిర్ధారిత పరీక్షలు చేసినట్టు కాటారం వైద్యాధికారి పూనెం రామారావు తెలిపారు. కాగా 3 పాజిటివ్ కేసులు నమోద య్యాయని, కరోనా వచ్చినా భయపడొద్దని అన్నారు. వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండి కరెనా ను జయిం చాలన్నారు. ఐసోలేషన్ కిట్ మందులు క్రమం తప్పకుండా వాడాలన్నారు. అలాగే డీపీఓ ఆశాలత గ్రామాన్ని సందర్శించి కోవిడ్-19 నిబంధనలు పాటించాలని సూచించారు. ఎస్సై సాంబమూర్తి, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ మల్లిఖార్జున్, సర్పంచ్ రాజబాబు, ఎంపీటీసీ రవి, జిల్లా రాట్ టీమ్, కంమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజయ్య, హెల్త్ అసిస్టెంట్ శ్యామ్, విలేజ్ సెక్రటరీ అపర్ణ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు ధైర్యాన్నిచ్చి అండగా నిలబడ్డారు. అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మాస్క్ ధరించకుంటే జరిమానా : ఎస్సై
మహాదేవపూర్ : మాస్క్ ధరించకుండా, షాప్‌ల వద్ద భౌతిక దూరం పాటించకున్నా జరిమానా విధిస్తామని కాళేశ్వరం ఎస్సై నరహరి హెచ్చరించారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం మండలంలో ప్రజలకు అవగాహన కల్పించి ఆయన మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. దుకాణాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.