Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
బడుగు బలహీన తరగతులను చైతన్యపర్చిన సామాజిక సంస్కరణకర్త మహాత్మ జ్యోతిభా పూలే ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆదివారం మహాత్మ జ్యోతిభా పూలే195వ జయంతి క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్ల ర్పించారు. అక్షరాస్యతోనే సామాజిక న్యాయం చేకూరుతుందని నాడు జ్యోతిభా పూలే అట్టడుగున ఉన్న పేదలను మేల్కొల్పొరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడీసీ ఎంఎస్ చైర్మన్ గుగులోతు రామ స్వామి, జెడ్పీటీసీ కోమండ్ల జయ గోపాల్ రెడ్డి, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. గురిజాల గ్రామంలో మలమహానాడు ఆధ్వర్యంలో, ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు.
పోచమ్మ మైదాన్ : వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం పండ్ల పంపిణీ చేశారు. ములుగురోడ్‌లో టీఎన్జీవో రూరల్ జిల్లా అధ్వర్యంలో పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
శాయంపేట: మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మండల పరిధిలోని గ్రామాలలో బీఎస్ ఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా శాయంపేట బస్టాండ్ కూడలిలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పరకాల : పరకాల పట్టణంలోని వివిధ పార్టీ కార్యాలయంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే వేడుకలను జరుపుకొని చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
నెక్కొండ రూరల్: నెక్కొండలోని అంబేద్కర్ భవనంలో ఆదివారం జ్యోతిరావ్‌పూలే జయ ంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నెక్కొండ సొసైటీ ఛైర్మన్ మారం రాము, మాదిగ హక్కుల దండోర రాష్ట్ర కోర్ సభ్యులు యాకయ్య సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈదుఊరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
నడికూడ: మండలంలోని నర్సక్క పల్లి గ్రామం లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఆధ్వర్యంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
న్యూ శాయంపేట: వరంగల్ మహానగరం ుహాత్మ జ్యోతిరావు పూలే 194 వ జయంతి ఉత్సవాలను వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో, మహాత్మ జ్యోతిరా వు పూలే కాలనీలో, ఎంసీపీఐయూ కార్యాలయంలో, బాల సముద్రంలోని ఇండిస్టియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో, సీపీఐ కార్యాలయంలో, 32 వ డివిజన్లో జయంతి వేడుకలు నిర్వహించారు.
నయీంనగర్: జనసేన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి ఆకుల సుమన్ నేత్రత్వంలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
వేలేరు: మండల కేంద్రం వేలేరు గ్రామంలో ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. గొట్టిముక్కుల సురేష్ (సబర్మతి) కరస్పాండెంట్ గారు లీగల్ అడ్వైజర్ కోడూరి రవి , మైనారిటీ సభ్యులు ఖాసీం, యూత్ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట: కాజీపేటలోని ఓబీసీ సెంట్రల్ ఆప ˜ీసులో జ్యోతిరావు పూలే 194వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఓబీసీ జోనల్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
ధర్మసాగర్: మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతిని పూలమాల వేసి నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు గంగారపు శ్రీనివాసు మాదిగ, మండల అధ్యక్షులు బొడ్డు భరత్ మాదిగ పాల్గొన్నారు.
పర్వతగిరి: మండలంలోని అన్నారం షరీఫ్‌లో వివేకానంద సేవా సమితి, మండల కేంద్రంలో స్వేరోస్, ఆనంతారంలో అంబెడ్కర్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఖిలా వరంగల్: కరీమాబాద్ ఉర్సు దర్గా హజ్రత్ మాషుక్ రబ్బాని ఆటోస్టాండ్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంత్యోత్సవ కార్యక్ర మానికి ఎమ్మెల్యే నరేందర్ ముఖ్యఅతిథిగా హాజర య్యారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సీపీఐ(ఎం) ఐనవోలు మం డల కార్యదర్శి లింగయ్య పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
హసన్‌పర్తి : 66వ డివిజన్ కేంద్రం హసన్‌పర్తిలో వేడుకలను నిర్వహించారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్య క్షుడు పావుశెట్టి శ్రీధర్ పూలే చిత్రపటానికి పూలమాల వేశారు. నేతాజి శిశుమందిర్ ఆవరణలో బీసీ సంక్షేమ సంఘం, ఉపాధ్యాయ పరపతి సంఘం సంయుక్తంగా నిర్వహించారు.