Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధప్రాతిపదికన పనులు ఆలోచింపచేసే ప్రతిమలు
- రూ.2,176 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పర్యటనకు నేడు రాష్ట్ర పురపాలక శాఖ, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాకకు వరంగల్ నగరం ముస్తా బవుతుంది. ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు నగరంలో అభివృద్ధి కార్యక్ర మాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రూ.2,176 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ నున్నారు. ఆదివారం పనులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఛీఫ్ విప్ వినరు భాస్కర్లు సమీక్షించారు. కాజీపేటలో ఫాతి మానగర్ జంక్షన్లో 'నాలెడ్జ్ ఈజ్ పవర్' అనే నినాదంతో ఒక బాలిక పుస్తకాన్ని పట్టుకున్న ప్రతిమను ఏర్పాటు చేశారు. బాలికల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా ప్రాధాన్యతనిస్తుందనడానికి ఈ ప్రతిమను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సుబేదారి జంక్షన్లో 'హరితహారం' పథకాన్ని గుర్తుకు తెచ్చే విధం గా రెండు చేతుల్లో చెట్టు పెరిగినట్లు ఒక ప్రతిమను ఏర్పాటు చేశారు. కాళోజీ జంక్షన్లో మానవుడు ఒకరు కూర్చొని ఉండగా, మధ్యనుండి పెరిగిన మొక్కను రెం డు కాళ్లతో పరిరక్షించినట్లు ప్రతిమను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జంక్షన్లో 'అశోక్ చక్రం' ఏర్పాటు చేయడం అందరినీ ఆకర్షిస్తుంది. కేయూ జంక్షన్లో సుందరీకరణ పనులు చేశారు.
రూ.2,176 కోట్ల పనులుత
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో దినసరి తాగునీటి సరఫరాకు సంబంధించి రూ.1,589 కోట్ల పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశా యిపేటలో జర్నలిస్టు కాలనీలో రూ.10.6కోట్లతో 200 డబుల్ బెడ్రూం ఇండ్లు, దూపకుంటలో రూ.31.8 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 600 డబుల్ బెడ్రూ ం ఇండ్లకు, ఎల్బీ నగర్లో రూ.2.35 కోట్ల అంచనా వ్యయంతో షాదిఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రూ.2.35 కోట్ల అంచనా వ్యయంతో మండిబజార్‌లో హజ్‌హౌజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. లక్ష్మీపురంలో రూ.6.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన పండ్లమార్కెట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. రూ.24 కోట్ల అంచనా వ్యయంతో ఇంటి గ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.0.63 కోట్ల అంచనావ్యయంతో నిర్మించనున్న 14 దుకాణాల సముదాయానికి శంకు స్థాపన చేస్తారు. లేబర్‌కాలనీ వంద అడుగుల జంక్షన్లో ఎస్ఆర్నగర్లో రూ.11.02 కోట్లతో నిర్మించిన 208 డబుల్ బెడ్రూంలకు ప్రారం భోత్సవం చేస్తారు. రూ.38.85 కోట్లతో తలపెట్టనున్న లేబర్‌కాలనీ- సికెఎం కాలేజీ నిర్మాణానికి, క్రిష్టియన్ కాలనీ సీబీసీ చర్చిలో రూ.1 కోటి అంచనా వ్యయంతో నిర్మించనున్న పనులకు, శివనగర్ వద్ద రూ.26 కోట్ల అంచనా వ్యయంతో శివనగర్ నుంచి మైసయ్యనగర్ వరకు స్టార్మ్ వాటర్ డ్రైన్ కం డక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆర్ఎస్ నగర్లో రూ.46 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న స్టార్మ్ వాటర్ డ్రైన్ కం డక్ట్ 12 వెంట్ల వర్క్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.3.68 కోట్లతో తలపెట్టిన శివనగర్ వాటర్ ట్యాంక్ నుంచి అండర్ బ్రిడ్జి రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. రూ.66 కోట్లతో నిర్మించిన బట్టలబజార్ ఆర్ఓబిని ప్రారంభిస్తారు. శివ నగర్ వద్ద రూ.7.8 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఆర్‌యుబిని ప్రారంభించనున్నారు. కరీమాబాద్ వద్ద రూ.8.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న దసరా రోడ్డు నుంచి ఉర్సుగుట్ట జంక్షన్‌కు రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. రంగశాయిపేట వద్ద రూ.22.75 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన కరీమాబాద్ రోడ్డు-గవిచర్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రూ.15.69 కోట్లతో ఫోర్ట్ వరంగల్ నుండి నాయుడు పెట్రోల్ పంప్ వరకు నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రూ.16.19 కోట్లతో నిర్మించనున్న 320 డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకుస్తాపన చేస్తారు. రూ.15 కోట్లతో నిర్మించనున్న తిమ్మాపూర్ నుండి బొల్లికుంట వయా సింగారం 2 లేన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కడిపికొండ జంక్షన్లో రూ.5.15 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేస్తారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వడ్డేపల్లిలో రూ.21.5 కోట్ల నిర్మించతలపెట్టిన వడ్డేపల్లి ఫోర్‌షోర్ అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. సమ్మయ్యనగర్‌లో రూ.22 కోట్లతో నాలా వాల్స్ నిర్మాణానికి, రూ.54 కోట్లతో చేపట్టిన డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి కెయు జంక్షన్లో రూ.10.39 కోట్ల అంచనా వ్యయంతో తల పెట్టిన చింతగట్టు, వంగపహాడ్, హసన్‌పర్తిలో నిర్మించే 196 డబుల్ బెడ్రూంల నిర్మాణానికి, రూ.0.30 కోట్లతో నిర్మించిన కేయూ జంక్షన్ సుందరీకరణ పను లను ప్రారంభించనున్నారు. వరంగల్ పశ్చిమ నియో జక వర్గంలో అంబేద్కర్ జంక్షన్లో రూ.0.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సుందరీకరణ పనులను ప్రారంభిస్తారు. రూ.4.5 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.0.80 కోట్లతో నిర్మించిన పద్మాక్షి వైకుంర Äధామాన్ని మంత్రి కేటీఆర్ సందర్శిస్తారు. రూ.1.40 కోట్లతో నిర్మించిన జైన్ ప్రతిమలను మంత్రి ప్రారంభిస్తారు. రూ.0.60 కోట్లతో నిర్మించిన సరిగమప పార్క్‌ను ప్రారంభించనున్నారు. రూ.2.50 కోట్లతో నిర్మించే కల్చరల్ హబ్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.35 కోట్లతో నిర్మించిన భద్రకాళి జియో బయో డైవర్సిటీ పార్క్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. రూ.65.50 కోట్లతో తలపెట్టిన భద్రకాళి సరస్సు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.4 కోట్లతో నిర్మించిన ఫాతి మానగర్ జంక్షన్ నుంచి పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ప్రారం భిస్తారు.