Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కందికొండ రామస్వామి జీవితం ఆదర్శనీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు రామిరెడ్డి అన్నారు. ఆది వారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో సమావేశపు హాల్లో నెల పొడుపు సాహిత్య సాంస్కతిక వేదిక ఆధ్వర్యంలో కందికొండ రామస్వామి స్మారక పుర స్కారం 2020 అవార్డు ప్రదాన సభ నెలపొడుపు సాహితీ సభ అధ్యక్షులు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆనంతరం పురస్కారానికి ఎంపికైన మండల కేంద్రానికి చెందిన ప్రముఖ కవి తండా హరీష్ గౌడ్‌కు కందికొండ రామ స్వామి స్మారక పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ రామస్వామి జీవితమంతా తాను నమ్మిన సిద్దాంతం కోసం కమ్యూనిస్టుగా ఎన్నో కష్టనష్టాలకోర్చి పార్టీకీ అంకితమయ్యారన్నారు. ప్రజాతంత్ర ఉద్యమాలకు దళిత గిరిజన ఉద్యమాలకు అండగా ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్ బాక్స్ కవిత్వం పుస్తక సమీక్షకులు వహీద్ ఖాన్, వంకేశ్వరం నిరంజన్, జెట్టిధర్మరాజు ,బోనాసి రాములు ,అబ్దుల్లా ఖాన్ ,సి.భాస్కర్ రావు, కందికొండ గీత, సీపీఐ(ఎం) నాయకులు పర్వతాలు, కందికొండ మోహన్, నెలపొడుపు సభ్యులు ముచ్చర్ల దినకర్, నీరటి బాలీశ్వర్ ,కల్వకోల్ మద్దిలేటి , వెంకట్ పవార్ ,గుడిపల్లి నిరంజన్, ఖాజా బాటసారి, గౌస్ పాష,కోట్ల గౌతమ్,భానుచందర్, కొక్కెరాములు, జీ.మురళీదర్ రావు, భూపాల్‌రెడ్డి బాసవెంకటేశ్వర్లు, డి.రాములు పరంధాములుగౌడ్, కందికొండ రామస్వామి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.