Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి
భూపాలపల్లి: మహాత్మా జ్యోతిబా ఫూలే సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాల కోసం విశేష కృషి చేశారని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శైలజ అన్నారు. మహాత్మ జ్యోతిరావుఫూలే జయంతి ని ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి టి.శైలజ జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధికి, సమాన అవకాశాల కు కృషి చేశారని కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ.. కుల,వర్ణ, లింగ వ్యవస్థకు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు అని అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఫూలే చేసిన కృషి ఎనలేనిది అన్నారు. ఎం మొగిలి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయ ఏఓ , వసతి గృహ సంక్షేమ అధికారులు ఎం మల్లయ్య, ఎన్ పైడి, ఎన్ ఎల్లస్వామి, ఆర్ శారద, జూనియర్ష్ట్ర అసిస్టెంట్ పాల్గొన్నారు.
మహాదేవపూర్ : మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ ఆవరణలోని మహాత్మా జ్యోతి భా పూలే విగ్రహం వద్ద బీసీ సంఘం సీనియర్ నాయకులు సముద్రాల తిరుపతి ఆధ్వర్యంలో పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఘన నివాళి అర్పించారు. మహణీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. సర్పంచ్ శ్రీపతిబాపు, జెడ్పీటీసీ గుడాల అరుణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆన్కరి భవాని, పీఏసీఎస్ చైర్మెన్ చల్ల తిరుపతిరెడ్డి, వైస్ చైర్మెన్ పెండ్యాల అనీల్ కుమార్, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, పంచాయతీ పారిశుధ్య స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య, మాజీ సర్పంచ్ కోట రాజబాపు, మాజీ పీఏసీిఎస్ చైర్మెన్ వామన్‌రావు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మోతె సాంబయ్య, మండల అధికార ప్రతినిధి జిల్లెల నాగరాజు, సీనియర్ మండల నాయకులు కారెంగుల బాపురావు, శ్రీనివాస్, ప్రకాష్, లక్ష్మణ్, సూరయ్య పాల్గొన్నారు.
చిట్యాల : మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతిని మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే తన భార్య సావిత్రి బాయి పూలే ద్వారా మొదటి పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందించిన మహానీయుడు అని అన్నారు. జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర, జడల్ పేట మాజీ సర్పంచ్ బొట్ల మొగిలి చిట్యాల మండల ముఖ్య సలహాదారు బొడ్డు ప్రభాకర్, మండల కన్వీనర్ గుర్రం రాజేందర్, కో-కన్వినర్ సరిగొమ్ముల రాజేందర్, జూకల్ గ్రామ అధికారులు కొమ్ము నరేష, మండల నాయకులు పుల్ల ప్రతాప్ గుర్రం తిరుపతి కట్కూరి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
మహాముత్తారం : మండల కేంద్రంలోని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మార్క రాముగౌడ్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాముగౌడ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే విధానాన్ని వీడనాడాలని అన్నారు. ఫూలె ఆశయాలు కొనసాగించాల న్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ రాదారపు స్వామి, పీఏసీఎస్ వైస్ చెర్మెన్ వెలమ రెడ్డి, అనిల్‌రెడ్డి, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు వెంకన్న, ఎంపీటీసీ శ్రీపతి సురేష్ గౌడ, మండల మహిళా అధ్యక్షురాలు లింగ మల్ల రమ, మైనారిటీ మండల అధ్యక్షుడు సాలార్ బేగ్, సీనియర్ నాయకులు జాటోత్ రూపానాయక్, మాజీ సర్పంచ్ రాజు, ముక్కెర రాజయ్య పాల్గొన్నారు.
తరిగొప్పుల : మహాత్మ జ్యోతీ రావు పూలే జయంతి సందర్భంగా మండల కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయం లో ఎంపీడీఓ ఇంద్రసేనరెడ్డి ఆధ్వర్యంలో, తహసీిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఫరీదుద్దీన్ ఆధ్యర్యంలో ఫూలె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
మల్హర్రావు : బీసీల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఆదివారం మండలంలోని మల్లారం, ఎడ్లపల్లి గ్రామాల్లో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల సాధికారత, విద్యయె అన్నింటికీ మూలమని బోధించిన గొప్ప మహనీయుడు పూలే అని కొనియాడారు. కార్యదర్శి రాము, నాయకులు లింగన్నపేట శ్రీధర్, విజ్జగిరీ రాజు, మధు, బిసి సంక్షేమ సఘమ మండల అధ్యక్షుడు బత్తుల తిరుపతి, సమ్మయ్య పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి : మండలకేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని సమాచార హక్కు చట్టం ప్రచార సమితి మండలశాఖ అధ్యక్షుడు బొచ్చు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు నిమ్మల భద్రయ్య హాజరై ఆయన చిత్రపటానికి పూలమా లవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఫూలె ఎనలేని కృషి చేశార న్నారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసినట్టు తెలిపారు. ప్రజలందరూ సమాన హక్కులను పొందడానికి సత్యశోధన సమాజ్ సొసైటీ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ సంస్థను ఏర్పాటు చేశాడని అన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు కట్కూరి ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో
కొడకండ్ల : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ సోమశేఖర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిన మహానీయుడని ఆయన సేవలను కొనియాడారు. అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు రవికుమార్, స్వేర్ మండల అధ్యక్షుడు తీగల సందీప్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.