Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విలేకరులు
మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జ్యోతిరావుపూలేకు ఆదివారం ఘనంగా నివాళ్లర్పించారు.
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎంపీ కవిత నివాళ్లర్పించి మాట్లాడారు. సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పూలే జయంతి నిర్వహించగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కలెక్టర్ గౌతమ్ తన క్యాంప్ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పలూమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. పూలే ఆదర్శభావాలను నేటి తరం కొనసాగించాలని ఆకాంక్షించారు.
డోర్నకల్ : మండలంలోని గొల్లచర్ల గ్రామంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో పూలే జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల నాయకుడు వెంకట్రాములు అధ్యక్షత వహించగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శెట్టి వెంకన్న నివాళర్పించి మాట్లాడారు. అనంతరం ఏఐకేఎస్ 84వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల నాయకుడు కొడవళ్ల సైదులు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అంగోత్ వెంకన్న, మండల కన్వీనర్ ఉప్పెనపల్లి శ్రీనివాస్, సీఐటీయూ మండల కార్యదర్శి దాసరి మల్లేశం, నాయకులు జాగర్లమూడి ప్రసాద్, వీరలక్ష్మీ, వెంకట్రాములు, బొబ్బ వెంకటరెడ్డి, దేవేందర్, గురువయ్య, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : తెలంగాణ అమరుల స్తూపం సెంటర్లో టీవీవీ ఆధ్వర్యంలో పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు గిన్నారపు మురళీ మాట్లాడారు. అనంతరం కవి వజ్రం నాగేశ్వరరావు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, రాములు, గిరి, రాజేందర్, లింగయ్య, ప్రవీణ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరులో... జ్యోతిరావుపూలే విగ్రహానికి మంత్రి దయాకర్‌రావుతోపాటు నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి టీపీసీసీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వర్రావు పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. మరిపెడలో పూలే చిత్రపటానికి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జిన్నా లచ్చయ్య పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కురవి మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత దైద భద్రయ్య ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. నెల్లికుదురులో ప్రజాసంఘాలతో కలిసి కేవీపీఎస్ ఆధ్వర్యంలో పూలే జయంతి నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విస్సంపల్లి సైదులు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్‌బాబు, టీడపీఈ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కడారి ఐలయ్య, మాజీ సర్పంచ్ పీఏసీఎస్ డైరెక్టర్ కసరబోయిన మంజుల విజరు యాదవ్, నారాబోయిన మల్లయ్య, గంగ, మదార్, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మెన్ జిలకర యాదాద్రి, నాయీబ్రాహ్మణ సంఘం మండల అధికార ప్రతినిధి కృష్ణ, ఎల్‌హెచ్‌పీఎస్ మండల అధ్యక్షుడు జాటోత్ వీరన్న, రమేష్, ఫొటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు రమణ, తదితరులు నివాళ్లర్పించారు.
ములుగులో.. మండలంలోని రామచంద్రాపురంలో సర్వర్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ పూలమాల వేసి నివాళ్లర్పించారు. జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ పూలే జయంతి నిర్వహించగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీరా కష్ణవేణి నాయక్ మాట్లాడారు. అలాగే నవభారతి మండల సమాఖ్య కార్యాలయంలో పూలే జయంతి నిర్వహించగా సెర్ప్ ఏపీఎం కలకోటి సంపత్‌కుమార్ మాట్లాడారు.