Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూసర్వే నేటికీ సమస్యగానే..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-తొర్రూరు
స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ధరణి చేపట్టడంతో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. నిజాం కాలం నుంచి రాష్ట్రంలో భూసర్వేకు పాలకులెవరూ పూనుకో లేదని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ రూ.47 కోట్లతో ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చి రాష్ట్ర బడ్జెట్లో రూ.400 కోట్లు వెచ్చించి భూసర్వేకు పూనుకున్నారని వివరించారు. వందేమాతరం ఫౌండేషన్ సౌజన్యంతో కాకతీయ ఇంజనీర్స్ అల్యూమినీ ట్రస్ట్ ఫర్ సర్వీస్ (కీట్స్) సంస్థ 25 మంది విద్యార్థులకు డిజిటల్ సర్వేపై ఆటోక్యాడ్ శిక్షణ ఇచ్చిన క్రమంలో ముగింపు సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దయాకర్‌రావు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 25 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఆటో క్యాడ్లో 45 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. డిజిటల్ సర్వేపై శిక్షణ ఇవ్వడంతోపాటు రూ.40 లక్షల విలువైన టేప్, కాంపాస్, డిజిటల్ థియేడలైట్ వంటి పరికరాలు సమకూర్చడం హర్షణీయమని చెప్పారు. భూసర్వే ఇప్పటికీ సమస్యగానే ఉంద న్నారు. గతంలో గొలుసులు పెట్టి ఏండ్ల తరబడి సర్వే చేసే వారని గుర్తు చేశారు. చెలకలు, పొలాలు కొలవాలంటే ప్రత్యేక వ్యవస్థ ఉండేదన్నారు. అక్షాంశ, రేఖాం శాల ఆధారంగా భూముల కొలతలు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ట్యాంపరింగ ్కు, తప్పుడు కొలతలకు, ఇతర పొరపాట్లకు ఆస్కారం ఉండదని చెప్పారు.
ఎర్రబెల్లికి ఘన సన్మానం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటీవల అవార్డులు పొందిన సందర్భంగా మంత్రి దయాకర్ రావును జెడ్పీటీసీ, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్ బోకే అందించి శాలువాతో సత్కరించారు. తొలుత మంత్రి దయాకర్‌రావు బస్టాండ్ సమీపంలోని జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. ఫూలే సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, వైస్ చైర్మెన్ జంగా సురేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మండల రైతు కోఆర్డినేటర్ అను మాండ్ల దేవేందర్‌రెడ్డి, మండల అభివద్ధి కమిటీ చైర్మెన్ డాక్టర్ సోమేశ్వరరావు, కౌన్సిలర్లు మాడుగుల నట్వర్, ఎన్నమనేని శ్రీనివాసరావు, బిజ్జాల మాధవి అనిల్, గుండాల నర్సయ్య, సోమారపు ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
'ఆర్యభట్ట' కరస్పాండెంట్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
పత్రికా విలేకరిపై బెదిరింపులకు పాల్పడ్డ ఆర్యభట్ట హైస్కూల్ కరస్పాండెంట్ నెలకుర్తి మధూకర్రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తొర్రూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పస్తం సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం మంత్రి దయాకర్‌రావుకు వినతిపత్రం అందించింది. అనంతరం సైదులు మాట్లాడారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు తాటికొండ సదాశివరావు, ఉపాధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు, కార్యదర్శులు పంతం సురేందర్, ఎండీ అమీర్, సహాయ కార్యదర్శి దొంగరి శ్రీనివాస్, పీఆర్వో కొమ్మనబోయిన యాకయ్య యాదవ్, సభ్యులు కొమ్ము దేవేందర్, పూర్ణచందర్, తండ సురేష్, తదితరులున్నారు.