Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్‌లో మరింత అభివృద్ధి దిశగా..వైస్ చైర్మెన్ దేశిడి శ్రీనివాస్‌రెడ్డి కృషి
నవతెలంగాణ-కొత్తగూడ
ఒకప్పుడు ఎరువులను తీసుకొచ్చేందుకు రైతులు ఉదయాన్నే ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం (పీఏసీఎస్) వద్ద క్యూలైన్లో నిల్చుకోవాల్సి వచ్చేది. ఎరువులను తీసుకొస్తున్న సందర్భంలో పెద్ద సంఖ్యలో రైతులు హాజరై ఘర్షణలకు, గొడవలకు పాల్పడే పరిస్థితి ఉండేది. ఒక్కోసారి రైతులను అదుపు చేయడం కోసం పోలీసుల సహకారం తీసుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకూడదని కాంక్షిస్తూ ప్రాథమిక సహకార కేంద్రాన్ని అన్ని రకాల మౌలిక సదుపాయాలతో అభివద్ధి చేసి రైతులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చూడాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాల ఓడీసీఎంఎస్ వైస్ చైర్మెన్, పీఏసీఎస్ చైర్మెన్ దేశిడి శ్రీనివాసరెడ్డి.
మండలంలోని పొగుళ్లపల్లిలోని పీఏసీఎస్ పరిధిలో కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాలకు చెందిన సుమారు 10 వేల మంది రైతులున్నారు. వీరిలో 42 వందల మంది ఓటర్లు. రుణ సభ్యులు 339కిపైగా ఉన్నారు. సహకార సంఘం కేంద్రం నుంచి ఎరువులు అందించడంతోపాటు రైతులు పండించిన పంటలను ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను లాభాల బాటలో నడిపిస్తున్నారు. గతంలో సహకార సంఘం ఆధ్వర్యంలో మూడు కొనుగోలు కేంద్రాలుండగా అదనంగా మరో రెండు కేంద్రాలతోపాటు ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇంకో రెండు కొనుగోలు ఏర్పాటు చేసి మొత్తం 7 కొనుగోలు కేంద్రాల ద్వారా 2018-19 రబీ సీజన్లో 67 వేల 388 బస్తాలు కొనుగోలు చేశారు. అలాగే 2019-20 ఖరీఫ్‌లో లక్షా 53 వేల 360, అదే ఏడాది రబీలో 44 వేల 298, 2020-21 ఖరీఫ్‌లో లక్షా 27 వేల 52 బస్తాలు కొనుగోలు చేశారు. వీటితోపాటు 2019-20 రబీలో 27 వేల 488, 2020-21 ఖరీఫ్‌లో 51 వేల 72 మొక్క జొన్న బస్తాలను కొనుగోలు చేశారు. 2020-21 సంవత్సరానికి కోటి 35 లక్షల 214లకుపైగా ఎరువులు కొనుగోలు చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రానికి ప్రభుత్వం నుంచి 50 లక్షల వరకు కమిషన్ రూపంలో రావాల్సి ఉంది. అంతేకాక సహకార సంఘం కేంద్రంలో ఇప్పటివరకు 9 లక్షల 70 వేల రూపాయలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. అర్హులైన రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేయగా అందులో కేవలం 211 మంది రైతులు మాత్రమే ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకున్నారు. అయితే స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులను అభివద్ధి చేసేందుకు అనేక పథకాలతోపాటు శిధిలావస్థలో ఉన్న సహకార సంఘాలను కూల్చేసి నూతన భవనాలు ఏర్పాటు చేయాలని, స్థలాల్లేని లేని చోట స్థలాలను సమకూర్చాలని ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పొగుళ్లపల్లి గ్రామంలో సహకార సంఘం భవనం నిర్మాణానికి ఉన్న 35 గంటల స్థలంలో భవన నిర్మాణానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరు చేసింది. భవన నిర్మాణంతోపాటు రైతులు తీసుకొచ్చిన అటువంటి ధాన్యం నిల్వల నిర్మాణం కోసం గోదామ్‌కు రూ.40 లక్షలు మంజూరు చేసింది. దీంతోపాటు కొత్తగూడ మండల కేంద్రంలో నూతన భవన నిర్మాణం కోసం రూ.50 లక్షలు మంజూరు చేయగా మండల కేంద్రంలో స్థలం లేకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.
సహకార సంఘ అభివృద్ధే లక్ష్యం : దేశిడి శ్రీనివాసరెడ్డి, ఓడీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా వైస్‌చైర్మెన్
సహకార సంఘాన్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యంగా పని చేస్తున్నా. గ్రామంలో ఉన్న 35 గంటల స్థలంలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనం నిర్మించడంతోపాటు ప్రత్యేకంగా ధాన్యం నిల్వల కోసం గోదాము కూడా ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే భవన నిర్మాణానికి గ్రామంలో కేటాయించిన స్థలాన్ని డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు, సర్పంచ్, పెద్దమనుషులతో కలిసి పరిశీలించాం. అయితే గతంలో రైతులు ఎరువుల కోసం అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. నేను చైర్మెన్‌గా, ఉమ్మడి జిల్లా వైస్ చైర్మెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు రైతులకు సకాలంలో ఎరువులు అందించడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన రుణాలను కూడా తెలియని రైతులకు తెలియజేసి అందిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నెరవేర్చడానికి, సహకార సంఘాన్ని అభివద్ధి చేయడంతోపాటు లాభాల బాటలో నడపడానికి కృషి చేస్తా.