Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్కౌంటర్-మావోయిస్టు మృతి
- 5 వాహనాలను దగ్ధం చేసిన మావోలు
నవతెలంగాణ-వెంకటాపురం
బీజాపూర్ జిల్లా తెర్రం, సిలిగేరు అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనలో 23 మంది జవాన్లు మృతి చెందగా 31 మంది జవాన్లు గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రతీకారం తీర్చు కుంటామని పోలీసులు అధికారులు హెచ్చరిం చిన క్రమంలో అప్పటి నుంచి అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. కాగా ఆదివారం దంతెవాడ జిల్లా గాదం, జంగపాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టు లకు నడుమ జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావో యిస్టు మృతి చెందాడు. చనిపోయిన మావో యిస్టును వెట్టి హూగా మిలిషియా కమాండర్ గా గుర్తించినట్లు సమాచారం. అతడిపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలిలో పిస్టల్, 2 కిలోల ఎల్ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టులు చనిపోయి ఉంటారని బీజాపూర్ ఎస్పీ పేర్కొన్నారు.
5 వాహనాలను దగ్ధం చేసిన మావోలు
బీజాపూర్ జిల్లా నామేడ్ పోలీస్స్టేషన్ పరిధిలో మింగచాల్ గ్రామ సమీపంలో వాటర్ గిడ్డర్ పనులు చేస్తున్న ఐదు వాహనాలను ఆదివారం మధ్యాహ్నం మావోయిస్టులు దగ్ధం చేశారు. వాటర్ గిడ్డర్ పనులకు ఉపయోగిస్తున్న 2 ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్, 2 ఎక్సావేటర్లు పూర్తిగా తగలబడ్డాయి. ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.