Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్‌లో ప్రారంభోత్సవాలు నగరం ముస్తాబు
నవతెలంగాణ-వరంగల్
రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో నగరంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు రాంపూర్‌కు చేరుకొని మంత్రి కేటీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ రోజు వారీ నీటి సరఫరాకు ప్రారంభోత్సవం చేస్తారు. 10.45 గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దేశాయిపేటలో జర్నలిస్టు కాలనీలో 2 బీహెచ్‌కే ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11 గంటలకు ఎల్బి నగర్లో షాదీఖానాకు, 11.15 గంటలకు మండిబజార్‌లో హజ్హౌజ్కు శంకుస్థాపన చేయనున్నారు. 11.30 గంటలకు లక్ష్మీపురంలో వ్యవసాయ మార్కెట్ వద్ద పండ్ల మార్కెట్ ప్రారంభిస్తారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కోసం శంకుస్థాపన చేయనున్నారు. 14 దుకాణాల సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 12 గంటలకు లేబర్‌కాలనీ 100 ఫీట్ల రోడ్డు జంక్షన్లో ఎస్ఆర్నగర్ వద్ద 2 బీహెచ్‌కే క ఇండ్లకు ప్రారంభోత్సవం చేస్తారు. గరీబ్‌నగర్‌లో పట్టాల పంపిణీ, సీకేఎం కాలేజీ నుంచి లేబర్‌కాలనీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. సీబీసీ చర్చిలో కోటి రూపాయలతో తలపెట్టిన పనులకు శంకుస్థాపన చేస్తారు. 12.15 గంటలకు శివనగర్ నుంచి మైసయ్యనగర్, ఆర్ఎస్ నగర్ నుంచి 12 వెంట్స్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ కండక్ట్లకు, శివనగర్ వాటర్ ట్యాంక్ నుంచి అండర్ బ్రిడ్జి వరకు రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్ఓబీ బట్టలబజార్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. శివనగర్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం చేయనున్నారు. 12.45 గంటలకు దసరా రోడ్ జంక్షన్ నుంచి ఉర్సు గుట్ట వరకు రహదారికి శంకుస్థాపన, కరీమాబాద్ రహదారి ఫ్లై ఓవర్ నుంచి గవిచర్ల రహదారికి శంకుస్థాపన, మధ్యాహ్నం ఒంటి గంటకు రంగశాయిపేటలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కోసం శంకుస్థాపన, ఫోర్ట్ రోడ్డు జంక్షన్ నుంచి నాయుడు పెట్రోల్ బంక్ వరకు రహదారికి శంకుస్థాపన, 1.15 గంటలకు ఖిలావరంగల్‌లో ఖిలావరంగల్ మైదానంలో బహిరంగసభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద 2 బీహెచ్‌కే ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన, తిమ్మాపూర్ నుంచి బొల్లికుంట గ్రామానికి వయా సింగారం రెండు లేన్ల వెడల్పు చేయడానికి శంకుస్థాపన చేయనున్నారు. 2.15 గంటలకు కడిపికొండ జంక్షన్లో కాజీపేట 2 బిహెచ్కె ఇండ్లకు శంకుస్థాపన చేస్తారు. వరంగల్-హైద్రాబాద్ జాతీయరహదారి 131 కిలోమీటర్ల వద్ద 5 కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 2.30 గంటలకు కాజీపేట
ఎన్ఐటీలో భోజన విరామం ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు వడ్డేపల్లి ఫోర్‌షోర్ డెవలప్మెంట్ ఆఫ్ వడ్డేపల్లి చెరువుకు శంకుస్థాపన చేస్తారు. 4.45 గంటలకు సమ్మయ్యనగర్ వద్ద వాల్ అండ్ స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిలుపుకోవడానికి శంకుస్థాపన, సాయంత్రం 5 గంటలకు కేయూ జంక్షన్లో (196 ఇండ్లు) చింతగట్టు, వంగపహాడ్, హసన్‌పర్తి వద్ద 2 బీహెచ్‌కే ఇండ్ల నిర్మాణంకోసం శంకుస్థాపన చేస్తారు. కేయూ జంక్షన్ వద్ద సుందరీకరణకు ప్రారంభోత్సవం చేస్తారు. 5.15 గంటలకు అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులను ప్రారంభిస్తారు. 5.30 గంటలకు డిపో క్రాస్‌రోడ్డు వద్ద ఐబీ గెస్ట్ హౌజ్ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కోసం శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6 గంటలకు జైన్ సైట్స్ పద్మాక్షి ఆలయ ప్రాంతంలోని వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ సందర్శిస్తారు. జైన్ సైట్లను పరిశీలిస్తారు. సరిగమప పార్కును ప్రారంభిస్తారు. సాంస్కృతిక కేంద్రం (కల్చరల్ హబ్)కు శంకుస్థాపన చేస్తారు. 6.30 గంటలకు భద్రకాళి బండ్ వద్ద భద్రకాళి జియో-బయో డైవర్సిటీ కల్చరల్ పార్క్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 7 గంటలకు శాయంపేట జంక్షన్లో మున్సిపల్ కార్పొరేషన్ రోజువారి నీటి సరఫరా ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడే జంక్షన్లో బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతారు. అనంతరం 7.30 గంటలకు ఫాతిమానగర్ జంక్షన్ నుంచి పోలీసు హెడ్ క్వార్టర్స్ వరకు పబ్లిక్ స్పేస్ డెకరేటివ్ లైటింగ్ ప్రారంభించడంతో మంత్రి కేటీఆర్ పర్యటన ముగుస్తుంది.