Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారు ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బల్దియా ఎన్నికలను పురస్కరించుకుని ఎల్బీ కళా శాలలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికా రులకు ఆదివారం ఏర్పాటు
చేసిన శిక్షణా తరగతులకు బల్దియా కమిషనర్ పమేలా సత్పతితో కలసి కలెక్టర్ హాజరై ఎన్నికల నిర్వహణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డుకు ఒకరు చొప్పున ఆర్వోలను, ఏఆర్వోలను నియమిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, తిరస్కరణ, ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రచురణ, బాలెట్ పేపర్ల తయారీ, తదితర బాధ్యతలు ఆర్వోల మీదే ఉంటాయని చెప్పారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వోలు, ఏఆర్వోలు) సమష్టిగా పని చేయాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శ కాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని తేటతెల్లం చేశారు. శిక్షణకు గైర్హాజరైన 10 మంది ఆర్వోలు, ఏఆర్వోలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బల్దియా కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి పమేలా సత్పతి మాట్లాడుతూ అధికారులు శిక్షణ ద్వారా సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్న క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. శిక్షణ తరగతులకు హాజరైన అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తప్పనిసరిగా ఓటు వేయాలన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు హరినాథ్‌రెడ్డి, సత్తిరెడ్డి, చిత్తరంజన్ ఆర్వోలు, ఏఆర్వోలు నిర్వర్తించాల్సిన విధుల గురించి కూలంకషంగా వివరించి పలు సందేహాలను నివత్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, పర్యవేక్షకుడు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.