Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షుడు గుండాల రఘు స్వేరో
- ప్రధాన కార్యదర్శి కొట్టెపాక శ్రీనివాస్ స్వేరో
నవతెలంగాణ-ములుగు
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని, అణగారిన వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే అంబేద్కర్ ఆలోచనా విధానాలు అమలు పరిచినట్లవుతుందని, ఇంకా దేశంలో అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం జరగట్లేదని, అంబేద్కర్ ఆలోచనా విధానాలు అమలు చేయ డంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, అమ లు జరిగే వరకు పోరాటాలు ఆగవని స్వేరోస్ ఇంటర్నేషనల్ ములుగు జిల్లా అధ్యక్షులు గుండాల రఘు స్వేరో, ప్రధాన కార్యదర్శి కొట్టెపాక శ్రీనివాస్ స్వేరో అన్నారు. అంబేద్కర్ 130వ జయంతిని పుర స్కరించుకొని వారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అంబేద్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. అందరూ చదువు కున్నపుడే సమాజంలో మార్పు, అభివృద్ధి సాధ్యమనేదని అంబేద్కర్ ఆకాంక్ష అన్నారు. చిన్ననాటి నుంచి అంబేద్కర్ ఎదుర్కొన్న వివక్ష నుంచి భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన మహౌన్నత వ్యక్తి అని కొని యాడారు.అంబేద్కర్ న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా, సంఘసంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. అలాంటి గొప్ప నాయకుని జయంతి వేడుకలను ఊరూరా, వాడవాడలా ఘనంగా నిర్వహించాలని సూచించారు.