Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
మండలం లోని నవాబుపేట, వడ్డిచర్ల, కోత్తపల్లి, తండాలు లింగాలఘనపురం, బండ్ల గూడెం గ్రామాల్లో సోమవారం కురిసిన ఈదురు గాలుల వడగండ్ల వర్షాలకు దెబ్బ తిన్న వరి పంటలను మండల వ్యవసాయ అధికారి జయంత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. వడగండ్ల వర్షం కారణంగా రాలిన వరి పొలాలను పరిశీ లించారు. మొదట గా వడ్లురాలి రైతులకు నష్టం జరిగిందని సుమారు 1200 ఎకరాలు నష్టం వాటిల్లిందని, ప్రాధమిక అంచనాను అధికారులకు నివేదిస్తామని చెప్పారు. త్వరలోనే నష్టం జరిగిన రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం టామని భరోసా ఇచ్చారు. సర్పంచ్ కాటం విజయకుమారస్వామి పాల్గొన్నారు.