Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల కన్వీనర్ పుట్ట నవీన్
నవతెలంగాణ-ధర్మసాగర్
విద్యా వాలంటీర్ల సమస్యలు పరిష్కరించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల కన్వీనర్ పుట్ట నవీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా సంక్షోభ కాలం నుంచి విద్యా వాలంటీర్లు సమస్యలతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మ హత్యలకు పాల్పడు తున్నారన్నారు. నల్గొండలో విద్యా వాలంటీర్ పాలకూరి శైలజ రైలు కిందపడి ఆత్మహత్య, కొమరం భీం జిల్లాలో బర్కుటే బండూ, ఆదిలాబాద్ జిల్లాలో తోడ సం రామస్వామి, నేడు శైలజ ఇలా విద్యావాలంటీర్ల ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కరోనా మూలంగా ఒక యేడాది నుంచి వారిని రెన్యువల్ చేయకపోవడంతో 13నెలలుగా ఎలాంటి ఉపాధి లేకపోవడం వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థి తులు ఇకముందు రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టక ప్రభుత్వ అవసరానికి పని చేయించుకొని రోడ్డున పడేసిన తెలంగాణ ప్రభుత్వ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అన్నారు. ప్రయివేటు ఉపాధ్యాయులతో పాటు విద్య వాలెంటరీలను కూడా ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో రానున్న రోజులలో టీఎస్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.