Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
నెక్కొండ మండలం పత్తిపాక శివారులోని ట్రాన్స్ఫార్మర్ ఆదివారం రాత్రి దగ్ధమైన స్ధానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ మంగళవారం ఉదయం ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ శివప్రసాద్ తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్పై అధిక ఓల్టేజి కారణంగా ట్రాన్స్ ఫార్మర్ అధిక ఉష్ణానికి దగ్గమైందన్నారు. ట్రాన్స్ఫార్మర్పై లోడు తగ్గించేందుకు మరొ కటి ఏర్పాటు ఎస్టిమేషన్ చేస్తున్నట్లు చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వెంటనే స్పందించి పంటలు ఎండిపోకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన విద్యుత్ సిబ్బంది, సబ్ ఇంజనీర్ శివప్రసాద్లకు గ్రామ సర్పంచ్ లావుడ్యా సరితాతిరుమల్, గ్రామ రైతులు బొల్లెబోయిన సురేష్, పసునూటి లక్ష్మీనారాయణ, పసునూటి యాకయ్య, లావుడ్యా శ్రీనివాస్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.